" పలుకులు నీ పేరే తలుచుకున్నా..పెదవుల అంచుల్లో అణుచుకున్నా..
మౌనముతో నీ మదిని భందించా...మన్నించు ప్రియా..
తరిమే వరమా...తడిమే స్వరమా...
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా...
వింటున్నావా...వింటున్నావా...వింటున్నావా... "
- అనంత శ్రీరాం
- సెలయేరుకు అటువైపు....
కదిలే మేఘాలు తనకోసం ఏవో తీసుకురావాలని అతను ఆశిస్తున్నాడు...ప్రతీ మేఘం ఇటే వస్తుంది...కానీ ఏమీ తేలేదన్నట్లుగా ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాయి...మనసు మెలిపెట్టినట్టుంది అతనికి...ఆమె ఎడబాటు భరించలేనిదిగా ఉంది...కాలితో ఓ రాయిని బలంగా తన్నాడు...కాసేపటికి వెలిసిందనుకున్న వాన మళ్ళీ మొదలైంది...కొన్ని చినుకులు అతన్ని సుతిమెత్తగా తాకాయి...ఏదో తెలుసుకుంటున్నట్టుగా అతను రెండు చేతులనూ చాచి, ఆకాశం వైపు చూస్తూ, చినుకులను తన గుండె మీదకు ఆహ్వానించాడు...మనసు మురిపెం పాటయ్యింది...
" విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా...
తొలిసారి నీ మాటల్లో...పులకింతల పదనిసలు విన్నా...
చాలు చాలే..చెలియా..చెలియా..
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా...
ఓ..ఓ...బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా... "
- అనంత శ్రీరాం
............
.......
ఇది కొద్ది రోజులుగా ఓ పాట వింటున్నప్పుడు నా కళ్ళముందు కనిపిస్తున్న ఓ దృశ్యం...కొన్ని పాటలు వింటుంటే ఊహలు ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి...అప్రయత్నంగా కళ్ళ ముందు ఓ దృశ్యం అలా కనిపించేస్తుంది...ఆ విరహ వేదనలో మనమే ఉన్నామా అన్నంత భావోద్వేగానికి లోనయిపోతుంటాము. కొన్ని రోజులనుండి ఆ పాట అలాంటి అనుభూతినే కలిగించేస్తుంది. అసలే మన రహ్మాన్ ట్యూన్ చేసాడు ఆ పాటని. అనంత శ్రీరాం రాసిన అందమైన సాహిత్యానికి శ్రేయా ఘోషల్ గళం కలిపింది..అది కూడా కార్తీక్ తో కలిసి...అసలు ఈ అమ్మాయి ఉంది చూశారూ...తను పాడిన పాటలు వింటున్నప్పుడే, ఆ గొంతుతో మన మనస్సులోకి పర్మిషన్ తీసుకోకుండా దూరి, రకరకాల భావోద్వేగాలను కలిగించి, కుళ్ళ బొడిచి వదిలేస్తుంది ...సున్నిత మనస్కులు అయితే

అందుకే నేను ఇకపై శ్రేయా ఘోషల్ పాడిన కొన్ని విరహంతో కూడిన పాటలు వినకూడదనుకుంటున్నాను...ముఖ్యంగా కార్తీక్ తో తను పాడిన ఈ విరహ గీతం అస్సలు వినను...
మీకు నచ్చితే ఇక్కడ నుండి మీ కంప్యూటర్లోకి దింపుకోండి.
******
( ఐపాడ్ ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకున్నాను..ఓ సాంగ్ ప్లే చేశాను..చేతిలోని ఐపాడ్ నా వైపు అదోలా చూసింది...సాంగ్ ప్లే అవుతోంది...'తరిమే వరమా...తడిమే స్వరమా...ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా'..ఎభై ఒకటోసారి అదేపాట మంద్ర స్థాయిలో మళ్ళీ వినిపిస్తుంది శ్రేయా గొంతులోంచి జాలువారుతూ.. )
40 కామెంట్‌లు:
పాట , పాట కన్నా మీరు రాసినవిధానము చాలా బాగున్నాయండి .
మీ నేస్తాలకు మేత వేయటము భలే సరదాగా వుందండి . ఇన్ని రోజులు నేను గమనించలేదు . ఈ రోజు కాస్త తీరికగా వుండి అదేమిటో చూద్దామని చూసాను . భలె టికు టికు మని తెనేసాయి .
:-)
పాట చాలా బావుంటుంది.. అది మిమ్మల్ని తన చుట్టూ తిప్పుకుంటున్న విధానం ఇంకా ఇంకా బావుంది.. చాలా బాగా రాశారు.. అసలు ఇలాంటి పాటలు పాడుకోవడం కోసమైనా అర్జెంటుగా ఒక ప్రేయసిని వెతుక్కోవాలనిపించదూ!! :-)
చాల చక్కని దృశ్యం :-) బాగా రాశారండి .పాట కూడా మీరు చెప్పినట్లే వుంది .
ఇదే పదచిత్రం/దృశ్యకావ్యం నన్ను ఉపిన భావన - మొదటిసారి కాదు దాదాపు వందోసారి విన్నాక కూడ. చాలా నిండుగా రాసారు. అభినందనలు.
ఇక మీ వరకు నిషి చివరిమాటే నాదీను...:)
ఎంత బాగారాసారండి...పాటకి పరిమళాన్నిచ్చినట్టుంది!
నాకైతే ఈ పాట వినగానే నచ్చేసింది.
ఈ పాట వింటుంటే నేనెక్కడున్నానో మర్చిపొతుంటా. ఈ పాట కోసం ఇండియాలో దిగగానే సినిమాకెల్లిపోయాను అక్కా వాళ్లు కాసేపు ఇంట్లో వుండరా అన్నా వినకుండా :-)
వహ్వా వహ్వా... శేఖర్ గారూ..భావి భావ కవి గారూ..అందుకోండి నా అభినందన మందార మాల.
@మాలా కుమార్ గారు,
థాంక్యూ..నా నేస్తాలు మీ మనసు కూడా దోచుకున్నాయన్నమాట...
@'పిల్లన గ్రోవి' రాధిక గారు,
:-)
థాంక్యూ..
@నిషిగంధ గారు,
అబ్బ..మీరు మనసులో ఉన్న అసలు విషయాన్ని భలే పట్టేస్తారండి...(దట్ ఈజ్ నిషిజీ)
పాట విన్న ఏభై ఒక్కసార్లు నాకు అలానే అనిపించింది..అనిపిస్తుంటుంది కూడా..:-)
థాంక్యూ..
@చిన్ని గారు,
థాంక్యూ..:)
@ఉష గారు,
మిమ్మల్ని కాస్త మెప్పించగలిగానంటే ఇంక నేను గాల్లో రెండో ఆలోచన లేకుండా తేలిపోవచ్చు..:)
థాంక్యూ...
@పద్మ గారు,
థాంక్యూ సో మచ్..
@బద్రి గారు,
అక్కా వాళ్ళు ఈ టపా చూసారంటే మీరెందుకు ఇంట్లో ఉండమన్నా ఉండలేదో ఇట్టే అర్ధం అయిపోతుంది..:-)
మరి మీవి కూడా ఇంచు మించు ఇటువంటి ఫీలింగ్సే కదా!!
థాంక్యూ..
@ప్రణీత గారు,
థాంక్యూ...మీరు బావి భావ కవి అంటుంటే నేనెక్కడికో వెళ్ళిపోయానండి...తోటరాముడు గారి భాషలో చెప్పాలంటే గాల్లో నిక్కరేసుకుని(సమ్మర్ కదా) తేలిపోతున్న భావన..:-)
పాత ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా అందంగా రాసారు శేఖర్ గారు. మీ టపా చదవగానే ఆ పాట విన్నాను..అలా వింటూనే ఉన్నాను..శ్రేయ గోషల్ "వింటున్నావా..." అని అడుగుతుంటే..వింటున్నా వింటున్నా అంటూ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలిదు
చిన్న కరక్షన్ "వేవేల వెన్నెల..." కాదు "వేవేల వీణల..."
ప్రేమతో హృదయం నిర్మలమవుతుంది. అంతటి నిర్మలత ఈ పాటలోనే కాదు మీ భావాల్లో కూడా నాకు కనిపించింది. తియ్యదనపు అమృతం కన్నా, పరిమళించే పువ్వు కన్నా, ఎంతో మధురమైన...సున్నితమైన ప్రేమ ఇది. ఒకవేళ ఆలకించే వారు లేకపోయిన ఆలపించక మానదు ఈ ప్రేమ. ఇంత అందమైన ప్రేమకు పలకని వారెవరైనా ఉంటారా! చాలా బాగుంది శేఖర్ గారు.
శేఖర్ నీకో చిరు నవ్వు :) కిషన్ నీకు రెండు చిరునవ్వులు.. :))
శేఖర్ నీకో చిరు నవ్వు :) కిషన్ నీకు రెండు చిరునవ్వులు.. :))
@కిషన్ గారు,
:-)
మిమ్మల్ని కూడా శ్రేయా మాయలో పడేసిందా!! లాభం లేదు కిషన్..ఆ అమ్మాయి మీద మనలాంటి వాళ్ళందరం కేసు వెయ్యాలి..మన ఎమోషన్స్ తో ఆడుకుంటుందని చెప్పి...:)
మీరు చెప్పినట్టే లిరిక్స్ సరిచేసాను...చాలా థాంక్స్..
కిషన్ చూశారా...నేస్తం గారు మన ఇద్దరిని చూసి ఎలా నవ్వుతున్నారో!! :)
@జయ గారు,
>>>తియ్యదనపు అమృతం కన్నా, పరిమళించే పువ్వు కన్నా, ఎంతో మధురమైన...సున్నితమైన ప్రేమ ఇది. ఒకవేళ ఆలకించే వారు లేకపోయిన ఆలపించక మానదు ఈ ప్రేమ. ఇంత అందమైన ప్రేమకు పలకని వారెవరైనా ఉంటారా!
మీరు రాసిన ఈ లైన్స్ కి రెండు మూడు విజిల్స్ వేసాను నేను ఇక్కడ...సూపర్బ్!!
థాంక్యూ...ఒక చిన్న రిక్వెస్ట్..మీ కాలేజీలో నేను చదవక పోయినా మీరు నాకు గురుతుల్యులు..నా పేరు చివర 'గారూ' చేర్చకండి ప్లీజ్...
@నేస్తం జీ
:-)
థాంక్యూ..
చాలా బాగా రాశారు శేఖర్ :-) నాకూ వినగానే చాలా నచ్చేసింది ఈ పాట.
శేఖర్ గారు! చాలా బాగా రాసారు. ఈ పాట నాకు కూడా చాలా ఇష్టం.
ముఖ్యంగా "తరిమే వరమా...తడిమే స్వరమా...
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా...
వింటున్నావా...వింటున్నావా...వింటున్నావా... " చాలా ఇష్టం. ఈ లైన్ల కోసమే ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు.
మీ ఊహ ఇంకా బాగుంది.
@వేణూ,
Happy to see you here again...
నచ్చిందన్నారు గానీ మీ కొచ్చిన ఊహని మాతో పంచుకోకుండా దాచేస్తున్నారేమో అని నా అనుమానం..:-)
థాంక్యూ..
@సవ్వడి గారు,
నాకు తెలిసి ఈ పాట ఒక్కసారి వింటే చాలండీ... రీపీటేడ్ గా మనం వినగలిగేలా చెయ్యగలగటం పాట సొంతం..పాటలో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరూ వాళ్ళ బెస్ట్ ని చూపించారేమో అని నాకనిపిస్తుంటుంది.
థాంక్యూ..
MEE "YETI GATTU "KABURLU CHALA BAGUNNAYI SHEKAR GARU.
శేకర్ జీ,వహ్వా వహ్వా...
పాట ఎంత అందంగా ఉన్న,మీరు చెప్పే విధానం దాని కి ఇంకా అందాన్ని చేకూర్చింది.శ్రేయ పాటలకి నేను పెద్ద ఫ్యాన్ అండ్ AC ని అండి.
@శ్రీనూ(తువ్వాయి) గారు,
థాంక్సండి..
@కవిత గారు,
థాంక్యూ సో మచ్..:)
@అశోక్ గారు,మీ నేస్తాలకి నేను మేత వేసాను..నాకు ఇదు రూపాయలు సెలవయింది ...ఎప్పుడు తిరిగి ఇస్తారు మరి??వాటిని చూస్తేనేమో వేయాలని పిస్తుంది మరి...
sekhar garu eroje me tapa chadivanu, naku ee patante chala istam mee yokka tapatho aa isthtam inka rettipaindanukuntunnanu
dhanyavadamlu:)
థాంక్యూ సో మచ్ ...మంచి పాటని పరిచయం చేసారు
@కవిత గారు,
ఇంతకు అశోక్ గారు మీకు ఐదు రూపాయలు ఇచ్చారా నా నేస్తాలకు మీరు మేత వేసినందుకు??
:-):-)
@పుష్పరాజు గారు,
థాంక్యూ..
@శివరంజని గారు,
థాంక్యూ..
శేకర్ జీ,అయ్యో అయ్యో అయ్యయ్యో .....శేకర్ ని...అశోక్ చేసానండి.ఎకౌంటు(బ్యాంకు ఎకౌంటు హోల్దేర్ నేమ్ కూడా) పేరు తప్పు చెప్పేసా...ఇప్పుడు అశోక్ గారి ఫీలింగ్స్ చూడాలి...ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి ల..."ఎవరి (మీ)నేస్తాలకు ఎవరు(నేను) మేతవేసారు...మధ్యలో నాకేంటి ఏ గోల" అనుకోని ఉంటారు...మరి నా ఇదు రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారు???
మీ టపా ఇప్పుడే చూశానండీ...అందరి మాటే నాదీను..పాటను ఈ మధ్యనే విన్నా నేను కూడా...ఇప్పుడు మీ బ్లాగ్లో చూసి డౌన్లోడ్ చేసేసుకున్నా..:)
శ్రేయా ఘోషాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.అదివరలో నేను రాసిన తపా గుర్తుందిగా..
@కవిత గారు,
:-)
అలా మేత వేస్తూ ఉండండి...ఓ వంద రూపాయలు అయ్యాక మీకు చెక్కు పంపిస్తాను..:-)
@తృష్ణ గారు,
గుర్తుందండి మీ టపా...అవునండీ..శ్రేయా గురించి ఎంత చెప్పినా తక్కువే..
థాంక్యూ..
శేఖర్ పెద్దగోపు గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
చిత్రగుప్తుడున్నాడు. లేక్కేస్తున్నాడు.
శేఖర్ గారూ నెక్స్ట్ టపా కోసం ఈగర్లీ వెయిటింగ్..
చాలా చాలా చాలా బాగా రాశారు. ఈ సినిమా పాటల కౌంట్ 100 ఎప్పుడో దాటిపోయింది నా ఐపాడ్ లో ;-) ఈ మధ్యే dvd వచ్చింది కదా! ఇప్పటికే నాలుగైదు సార్లు చూసేసా సినిమాని :-)
అన్నట్టు, ఈ ఆల్బం లో 'ఆరోమలె' పాట సోదిలే అనుకున్నా ఫస్ట్. సినిమా చూసాక ఆ పాట బాగా నచ్చుతోంది. రెహ్మాన్ పాటలెప్పుడూ అంతే నాకు. ముందు ఏదో ఒక పాటే బాగుంది అనిపిస్తుంది.. అలా అలా వినగా కొన్నిరోజులకి అన్నీ తెగ నచ్చేస్తాయి. ముఖ్యంగా సినిమా చూశాక.. ;-)
@మోహన,
చిత్రగుప్తుడు...లెక్కవేయటం...అంత పాపం ఏం చేసానబ్బా నేను!!
@ప్రణీత గారు,
ఈ మధ్య ఒక సాఫ్ట్ వేర్ క్లాసులకు అటెండ్ అవుతూ ఆఫీస్ కి పోవటం వల్ల అస్సలు కుదరటం లేదు..రాయలన్నా మూడ్ కూడా రావటం లేదు..త్వరలో రాసేస్తానండీ.
థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్..
@మధుర వాణి,
నాది కూడా పాటలు వినే కౌంట్ ఇప్పుడు వంద దాటేసిందండి...నాలుగైదు సార్లు చూశారా మీరు? నాగ చైతన్య ఆ సినిమాలో లేకపోతే సినిమాని ఎన్ని సార్లైన చూడొచ్చండి నా ఉద్దేశంలో..ముఖ్యంగా జెస్సీ కోసం...:-):-)
ఆరొమలె పాట నేను వినలేదండీ..ఈ సారి వినాలి. రెహ్మాన్ విషయంలో మీరన్నది చాలా నిజం...నాది సేం టు సేం ఫీలింగ్...మొదట్లో ఆ ఏముందిలే అని అనిపిస్తుంది..వీడియోలో పాట చూసినప్పుడు తెలుస్తుంది అసలు మజా...
శేఖర్ గారూ , మీటపా చదివాక మరోసారి ఆ పాట విన్నాను ముందుకంటే మధురంగా ఉందంటే అది నా ప్లేయర్ తప్పుకాదు సుమండీ :) :)
అన్నట్టు మాలాగారు చెప్పేవరకూ నేనూ పట్టించుకోలేదు మీ నేస్తాలు భలే చురుకండీ :)
nice one andi. mee explanation chala bagumdi
@పరిమళ గారు,
:-)
థాంక్యూ..
@హను గారు,
థాంక్యూ..
@ఇద్దరికీ..సారీ ఫర్ ద లేట్ రిప్లై..
శేఖర్! మీ మెయిల్ ఐడి కాస్త ఇస్తారా... నా బ్లాగులో ఇవ్వండి.
పాట, మీరు వర్ణించిన విధానం ఒకదాన్ని మించి మరొకటి బాగున్నాయండీ..
మురళి గారు,
మీ కామెంట్ చూడగానే ఫుల్ ఖుష్ అయిపోయాను....Thanks for the encouragement...
కామెంట్‌ను పోస్ట్ చేయండి