ఒక్క ఉదుటున క్రిందకు పడే జలపాతం లో అలుపులేని నీ ఉత్సాహమే కనిపిస్తుంది.. కొండ కోనల్లో వయ్యారంగా తిరుగుతున్నప్పుడు నీ నడుము ఒంపు సొంపులే గుర్తొస్తున్నాయి.. నేలను తాకి ప్రవాహంగా మారే క్రమంలో చేసే గల గలలు నీ ఊసుల్లానే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి అక్కడే తడుస్తూ కేరింతలు కొడుతున్న జనంలో నా కళ్ళు నీ కోసం తెగ గాలించాయి... కొంత దూరం లో చూస్తే నీరంతా ప్రశాంతగా ఉంది నువ్వు నా ఒడిలో సేదతీరుతున్నట్టుగా... ఎక్కడ ఉన్నా నీ ఆలోచనలు నాలోని 'నన్ను' పక్కకునెట్టి నన్నావహించేస్తున్నాయి.. |
ఒక కలయిక
1 వారం క్రితం
25 కామెంట్లు:
"ఎక్కడవున్నా నీ ఆలోచనలు నాలోని "నన్ను"పక్కకు నెట్టి నన్నావహించేస్తున్నాయి "...........చాలబాగుంది..
మీలోని రచయిత, కవి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టున్నారు.. గుడ్..
చాలా బాగుంది. ఇంతకంటే ఎలా చెప్పాలో తెలియడంలేదు..
చాలా బాగుంది :) అరే అచ్చం నేను ఇలానే అనుకుంటాను అన్నట్టు అనిపించింది .....పిక్చర్ కూడా బాగుంది .
too good..
చాలా బాగుంది!
WOW...beautiful poetry :)
చాలా చాలా బాగుంది.
ఎంతో బాగుందండి.....
అందమైన కవిత ! కవిత చిత్రం లోంచి పుట్టుకొచ్చిందా లేక కవితకు చిత్రం వెదికారా అని సందేహం !అంతందంగా అమరాయి మరి !
@చిన్ని గారు,
నాకూ వ్యక్తిగతంగా ఆ లైనే నచ్చిందండి. థాంక్యు.
@మురళి గారు,
మీ వాఖ్య చదివి కాసేపు నేను ఎక్కడికో వెళ్ళిపోయానండి. మంచి కాంప్లిమెంట్ తో కమెంట్ చేసి ప్రోత్సహించిన మీకు చాలా చాలా థాంక్స్.
@శిశిర గారు,
అంతేనంటారా...థాంక్యు.
@సిరి గారు,
థాంక్యు...ఇంచుమించుగా ప్రతీవారు ఎడబాటులో ఫీలయ్యే కామన్ భావనలేననుకుంటా ఇవి.
@మోహన గారు,
థాంక్యు..
@మందాకిని గారు,
థాంక్యు..
@మధురవాణి గారు,
పొయెట్రీ అన్న గుర్తింపు ఇచ్చినందుకు సంతోషంగా ఉందండి...థాంక్యు..:)
@సృజన గారు,
థాంక్యూ సో మచ్..
@పద్మార్పిత గారు,
ఎదో అలా రాసేసానండీ..మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది. థాంక్యు.
@పరిమళం గారు,
కొద్ది రోజుల క్రిందట ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కి వెళ్ళానండీ..అక్కడ మెదిలిన ఆలోచనలకు పూర్తి వాఖ్య రూపం ఇచ్చి, కొద్ది రోజులు బొమ్మ కోసం గూగులమ్మ కాళ్ళ వేళ్ళా పడి వేడుకుంటే ఆ బొమ్మ ఇచ్చిందండి. థాంక్యు..
మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.
మీ,
జీవని.
వహ్వా వహ్వా శేఖర్ గారూ..వహ్వా వహ్వా..
భావ కవిగారూ వహ్వా వహ్వా!!
చాలా బాగుందండీ..
@జీవని గారు,
క్షమాపణ ఎందుకండీ? మీరేమీ అనుచిత వ్యాఖ్యలు రాయలేదుకదా!!
మీ సైట్ బాగుందండి. నాకైతే పెద్దగా సూచించడానికి ఏమీలేవనిపించింది. కంటెంట్ ఒక్కటీ తెలుగులో కూడా ఉంటే బాగుంటుంది.
@ప్రణీత గారు,
మీ కమెంట్ చదివి చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక నాకు నేనే ఒకసారి వహ్వా..వహ్వా అనుకుంటూ జబ్బలు చరుచుకున్నానండీ..:-)
థాంక్యు..
శేకర్ చాలా బాగుంది.. ఇంక ఏదైనా పెద్ద వర్డ్ ఉందేమో చూడూ చాలా చాలా బాగుంది
శేఖర్ గారు,
పిక్చర్ చాలాబాగుంది ,అక్కడికి వెళ్లిపోవాలి అన్నట్లుగా ఉంది ,కవితకుడా బాగుంది.ఇంకా మీ జ్ఞాపకాల రంగవల్లి చదివితే ,మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి .చాల బాగా రాసేరు .
@నేస్తం గారు,
థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మంట్...
@అనఘ గారు,
పిక్చర్ బాగుందని చదువుతుంటే దాన్ని వెతికినప్పుడు పడ్డ శ్రమ మర్చిపోతున్నానండీ...థాంక్యు..
జ్ఞాపకాల రంగవల్లి టపా నచ్చినందుకు నెనర్లు.
కవిత బాగుంది. మంచి పిక్చర్ బాగుంది. కవిత కి బ్లాక్ బాగ్రౌండ్ ఎందుకండి? ఎంత చక్కటి ప్రకృతో! నేను చూసిన కొన్ని జలపాతాలు గుర్తుకొచ్చాయి.
@జయ గారు,
థాంక్యు...కవితలోని లైన్లకు బ్లాకు బ్యాక్ గ్రౌండ్ లేకపోతే అవి పిక్చర్ మీద సరిగ్గా కనపడట్లేదండి..అందుకే అలా పెట్టాను...
శేఖర్ గారూ..ఏంటండీ..కొత్త టపా ఏది?
కవిత సోసో
బొమ్మ సూపరు
యిట్టా కదిలే బొమ్మ మీద కవిత పెట్టి టపా కట్టించిన మీ యుక్తి సూపరో సూపరు
జలపాతం , కవిత రెండూ చాలా బాగున్నాయి .
@ప్రణీత గారు,
కొంచెం బిజీ అండీ..త్వరలోనే ఇంకో టపా రాస్తాను. :)
@కొత్తపాళీ గారు,
:)
థాంక్యూ..
@మాలా కుమార్ గారు,
థాంక్యూ..
బొమ్మ, కవిత రెండూ చాలా బాగున్నాయండీ.
@వేణు గారు,
థాంక్యూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి