24, ఏప్రిల్ 2010, శనివారం

ఈనాడులో 'ఏటిగట్టు'

"ఓలమ్మో...ఓలమ్మో...నా మనవడు అగుపించట్లేదు...ఎటెళ్ళి పోనాడో ఏవిటో...ఓలైనా సూసినారా.." - అంటూ మా నాయనమ్మ గాభరా పడుతూ వాకిట్లోకి వచ్చింది.

ఆవిడ చేసిన హడావిడికి ఎక్కడ పని అక్కడ వదిలేసి ఓ పదిమంది మా కాలనీ ఆడోళ్ళు మా ఇంటి ముందు గుమిగూడారు.

"ఓలప్పా..ఏటైనాదే..నీ మనవడు అగుపించకపోవటం ఏటి..ఇల్లంతా ఎతికావా.." అడిగింది పరమేశ్వరి మామ్మ..

"ఈవిడ చాదస్తం కాకపోతే చెట్టంత మనవడు ఎక్కడికి పోతాడు..మొన్న కూడా ఇలానే కనపడకపోతే నానా రభసా చేసింది ముసలమ్మ...తీరా చూస్తే పెరట్లో పెద్ద మంచానికి నల్లుల కోసం టిక్ ట్వంటీ కొడుతూ దాని కింద కనపడ్డాడు..ఈవిడేమో ఎక్కడా సూడకుండా వాకిట్లో పంచాయితీ పెట్టేసింది..." సన్నగా గొణిగారు ఎవరో..

"అది కాదే..అప్పా..రేతిరంతా ఆ కంపూటర్ కాడ కూకుంటున్నాడని ఓ పిసర తిట్టానా..అందుక్కాని పోనాడా అని డెవుటొచ్చేసినాది..." అరుగుమీద కూర్చొంటూ అంది నాయనమ్మ.

"ఒసేయ్ నాయనమ్మా..నేను ఇక్కడున్నానే..చూడు.." అంటూ నా చేతిలో ఆడుకోడానికి తెచ్చుకున్న చింత పిక్కల్లో ఒకదాన్ని తీసుకుని నాయనమ్మ వైపు విసిరాను..అది సరాసరి వెళ్ళి ఆమె బోడిగుండుకు తగిలింది.

"ఎవడ్రా సన్నాసి ఎధవ నా గుండు మీద కొట్టింది" ఆవేశంగా అరుగుమీంచి లేచి చుట్టూ చూసింది.

"ఇటే..ఇటువైపు...పైకి...పైకి చూడు"

( జనరల్ గా నేను పట్టలేని ఆనందం వచ్చినప్పుడు తొమ్మిదో నెం. ఆకాశంపైకి ఎక్కేస్తుంటాను..ఈ మద్య తాగుబోతుల్లుకు కూడా దీని గురించి తెలిసిపోయినట్టుంది...ఫుల్ రష్ ఉంటుంది అక్కడ )

ఈ సారి కుంకుడు పిక్క విసిరితే నాయనమ్మకు పట్టలేని కోపం వచ్చి ఎదురుగా ఉన్న ఎవరినైనా పీకుతుందని ఆలోచించి విసరలేదు.

ఓ చెయ్యి నుదుటికి అడ్డుపెట్టుకుని, సోడా కళ్ళద్దాలను సర్దుకుంటూ, తలపైకెత్తి చూసింది..ఆమెతో పాటు మిగిలిన వాళ్ళూ పైకి చూశారు..

"ఒరేయ్..అల్లక్కడ ఏటి సేస్తున్నావ్ రా? నీ కోసం పెసరట్టేసా...ఫెష్ కొబ్బరి పచ్చడి సేసా..బేగి పారొచ్చెయ్.."

నన్ను చూసి మిగిలిన ఆడోళ్ళు గొణుక్కుంటూ వెళ్ళిపోయారు.

మా నాయనమ్మ పెసరట్టు,కొబ్బరి పచ్చడి అనగానే నోట్లో నీళ్ళూరాయి...తొమ్మిదో నెం. ఆకాశం నుండి పారాచూట్ సహాయంతో క్రిందకు దూకాను.

వేడి వేడి పెసరట్టుతో కొబ్బరి పచ్చడి తింటుంటే మళ్ళీ ఆ ఆకాశం నెం. తొమ్మిది మీదకు వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ అప్పుడే పెసరట్టు తిరిగేయటం వల్ల వేడి వేడిగా ఉన్న గరిటే నాయనమ్మ చేతిలో చూసి ఆ ప్రయత్నం మానుకున్నాను.

"ఆ...ఇప్పుడు సెప్పు....అల్లక్కడికెందుకు పోనావురా...లంకంత కొంప ఉంచుకుని..." ఇంకో పెసరట్టు వడ్డిస్తూ అడిగింది

"నానమ్మా...మరి...మరి...ఈరోజు నేను రాసే రాతల గురించి ఈనాడు పేపర్లో పడిందే..అందులో నా పేరు చూసుకునే సరికి కళ్ళు బైర్లు కమ్మాయి. కళ్ళు తెరిచేసరికి ఆ ఆకాశం నెం. తొమ్మిదిలో ఉన్నాను.." కొబ్బరి పచ్చడి నాలిక్కి రాసుకుంటూ చెప్పాను.

నా సమాధానం విని నాయనమ్మ లేచి నిలబడింది..వెంటనే అరుగుమీదకు వెళ్ళి గట్టిగా - "ఏటేటీ..నీ రాతల గురించి పేపర్లో పడినాదా!...ఒసేయ్..రంగమ్మా..చిట్టేమ్మా...అప్పాయమ్మా...ఇలా రండే..మీకొక కవురు సెబుతాను..అజ్జెంటుగా పారొచ్చెయండి.." అని అరిచింది.

ఓ గంట 'నేను..నా మనవడు..నా వంశం' అనే అంశం మీద వచ్చిన వాళ్ళందరికీ సెమినార్ ఇచ్చింది. తర్వాత నా దగ్గరగా వచ్చి చెయ్యి భుజం మీద వేసింది. "పాపిట్టి దాన్ని..నువ్వు అర్ధరాత్రుల్లు ఆ కంపూటర్ డబ్బా ముందు కూకుంటే ఏటో అనేసుకుని తిట్టేసాను నిన్న...ఇవట్రా నువ్వు రాస్తుంది..." అని భాదపడుతూ ఆ పక్క టేబుల్ మీద ఉన్న గ్లిజరిన్ సీసాలోంచి రెండు చుక్కలు చేతి మీద వేసుకుని కళ్ళకు రాసుకుని ఏడ్చింది.

మళ్ళీ మాట్లాడింది..

"మన వంశంలో నేనొక్కదాన్నే రాయగలను..ఈ రాసే అలవాటు నా మనవళ్ళు, మనవరాళ్ళు లో ఎవరికి రాలేదేటబ్బా అని తెగ భాదపడిపోయేదాన్నిరా...ఇప్పుడు నువ్వు కూడా రాసేత్తున్నావంటే సానా ఆనందంగా ఉందిరా..."

మా నానమ్మ 'నేనూ రాస్తాను' అనే సరికి దిమ్మ తిరిగి తింటున్న కొబ్బరి పచ్చడి పెసరట్టు ముక్కతో సహా గొంతులోనే బ్లాక్ అయింది.

"ఏంటే...నువ్వు కూడా రాస్తావా.."

"మరి నానేటనుకుంటున్నావ్...ఒకటి కాదు రెండు కాదు..మూడు పుస్తకాలు రాసానురా.." కళ్ళెగరేస్తూ, చేతులు తిప్పుతూ చెప్పింది.

"నిజ్జంగా...నువ్వు గ్రేటే..ఇంతకూ ఏమీ రాసావు..దేని గురించి రాసావు..ఏవీ అవి చూపించు..." ఉత్సాహం అపుకోలేక అడిగాను.

"ఇంకేడ ఉంటాయిరా...నీ బాబు కాశీ తీసుకెళ్ళంగానే ఆడే ఇచ్చేసి రాలే..."

నాకేమీ అర్ధం కాలేదు..."కాశీలో ఇచ్చేయటమేంటే..నీ మొహం..అర్దమయ్యేలా చెప్పు.."

"మరి..రామకోటి రాసిన పుస్తకాలు రాయటం అయిపోనాక కాశీలో ఇచ్చేయాలిరా.." తాపీగా అసలు విషయం చెప్పింది..

"ఏంటి మాడు పుస్తకాల్లో రామకోటి రాసావా...ఇంకేమీ రాయలేదా?"

"ఆ..మూడో కెలాసు సదివిన నాను అంతకంటే ఏటి రాత్తాను...అయినా నీతో కవుర్లు సెప్పుకునే తీరికలేదు గానీ..మనసులో సానా ఆనందంగా ఉందిరా...నా వంశంలో రెండో మనిషివి రాస్తున్నావంటే...అందుకే నేను కూడా ఆ తొమ్మిదో నెం. ఆకాశంలోకి పోతున్నా" అంటూ లేచింది.

"ఇంకోసారి నిన్ను నువ్వు రైటర్ అని చెప్పుకున్నావనుకో నీ సోడా కళ్ళద్దాలు కిందపడేసి తొక్కుతా..." పచ్చడిలో ఉన్న మిరపకాయ నములుతూ అన్నాను..

ఏమీ వినిపించుకోనట్టుగా వెళ్ళిపోతుంది నానమ్మ..

"నాయనమ్మా..ఆగవే..నేనూ టిఫిన్ తినటం అయ్యాక అక్కడకే వెళ్తాను..ఇద్దరం కలిసే వెళదాం.."

నాయనమ్మ దగ్గరగా వచ్చి, ఓ పెసరట్టు ముక్కని పచ్చడిలో ముంచి నోటికి అందించింది...నేను గ్లిజరిన్ బోటిల్ కోసం చుట్టూ చూశాను.

*********


-( ఈ రోజు పొద్దున్నే నా బ్లాగు ఈనాడు పేపర్లో చూసి ఇంకేమీ ఆలోచించకుండా Cloud 9 లోకి వెళ్ళిపోయాను..ఇలాంటి టైంలో నాకొక బంగారుమురుగు కధలో లాంటి బామ్మ ఉంటే, ఆవిడ ఎలా ఫీలవుతుందో అని ఊహించి రాసాను...

నాచిట్టి బ్లాగును, దానిలోని రాతలను బయట ప్రపంచానికి పరిచయం చేసిన 'మనసులోమాట' సుజాత గారికి మన:పూర్వక కృతజ్ఞతలు..అలాగే నేను రాసిన రాతలను ఓపిగ్గా చదివి, అభిప్రాయం తెలిపి, కొండంత ప్రోత్సాహం అందించిన బ్లాగ్మిత్రులకు చాలా చాలా థాంక్స్. )

47 వ్యాఖ్యలు:

శిశిర చెప్పారు...

అభినందనలు శేఖర్ గారు.

సిరిసిరిమువ్వ చెప్పారు...

భలే! మీదైన తరహాలో వ్రాసారు..అభినందనలు.

sunita చెప్పారు...

అభినందనలు శేఖర్ గారు.

మురళి చెప్పారు...

మనః పూర్వక అభినందనలు శేఖర్ గారూ.. నా బ్లాగ్ గురించి ఈనాడు లో వచ్చిన రోజున కూడా ఇంత సంతోషం కలగలేదు. నా కారణంగా మీకీ చాన్స్ మిస్సయ్యిందేమో అని గత కొద్ది రోజులుగా పడుతున్నగిల్ట్ పూర్తిగా తొలగి పోయిందివాళ. మై స్పెషల్ థాంక్స్ టు సుజాత గారు..

swapna@kalalaprapancham చెప్పారు...

wow congrats

సుజాత వేల్పూరి చెప్పారు...

మురళి,
అలాటిదేం లేదండి! నిజానికి ఇది మొదట్లో మీరు శేఖర్ బ్లాగు రివ్యూ రాసిన తర్వాతి వారం ప్లాన్ చేశాను. మీ రివ్యూ చూశాక కొద్ది గాప్ తీసుకున్నాను. అంతే! శేఖర్ బ్లాగ్ ఎలా మిస్ చేస్తాను?

Ravi చెప్పారు...

ఇదిగో నేనూ ఏటిగట్టుకు వచ్చానండోయ్..నా అభినందనలు కూడా అందుకోండి....

Hima bindu చెప్పారు...

wav! congrats .......

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

congrats............

SRRao చెప్పారు...

శేఖర్ గారూ !
అందుకోండి అభినందనలు

అజ్ఞాత చెప్పారు...

అభినందనలు..!

Unknown చెప్పారు...

shekar gaaru,
mee style lo mallee navvicchaarandee, mee postlu chaala chadivesa, annitlokee "ganitham tho thakadimi thom" chaala nacchesindi naaku. anyways meeku boledu abhinandanalu
aparna

జయ చెప్పారు...

శేఖర్ గారు హృదయపూర్వక అభినందనలండి. చాలా అనందంగా ఉంది. ఇలాంటి కబుర్లు ఇంకా మీరు చాలా చెప్పాలి. ఏడుపెంకులాటతో సహా:)

కొత్త పాళీ చెప్పారు...

అభినందనలు

స్రవంతి చెప్పారు...

అభినందనలు

మరువం ఉష చెప్పారు...

అభినందనలు.

సురేష్ వంగూరి చెప్పారు...

congrats for your efforts. without eenadu, i would not have known about your blog. wonderful.

Padmarpita చెప్పారు...

అభినందనలు శేఖర్ గారూ....

k.karthik చెప్పారు...

congratulations
and keep blogging

మోహన చెప్పారు...

"...బేగి పారొచ్చెయ్.."
చాన్నాళ్ళయ్యింది ఈ మాట విని... చదివి ఆనందమేసింది.
>>పెసరట్టు,కొబ్బరి పచ్చడి అనగానే నోట్లో నీళ్ళూరాయి...
నాక్కూఒడాఆ..
'నేను..నా మనవడు..నా వంశం' అనే అంశం మీద వచ్చిన వాళ్ళందరికీ సెమినార్ ఇచ్చింది.
హహహా....
>>"మరి..రామకోటి రాసిన పుస్తకాలు రాయటం అయిపోనాక కాశీలో ఇచ్చేయాలిరా.."
:)))))
>>"ఇంకోసారి నిన్ను నువ్వు రైటర్ అని చెప్పుకున్నావనుకో నీ సోడా కళ్ళద్దాలు కిందపడేసి తొక్కుతా..."
:))))))))))

Congratulations. పేపర్ లో మీ గురించి రాసి మంచి పని చేసారు. మాకు ఈ టపా దొరికింది.. బాగా రాసారు. :)
Keep writing.

జ్యోతి చెప్పారు...

Congratulations...

debo చెప్పారు...

bagundi boss..nenu uk lo untanu..nenu srikakulam nunchi vaccha..maa language vaadi navvu teppinchavu...kaani srikakulam vallu chala kasta padataru...vallalo prema apyatalau natural ga vuntai, nee kada lo cheppinattu...

కౌండిన్య చెప్పారు...

అభినందనలు శేఖర్ గారు

మధురవాణి చెప్పారు...

శేఖర్ గారూ,
మీకు హృదయపూర్వక అభినందనలు.
మీ టపా మొత్తం ఇంకా చదవలేదు. లాస్ట్ లైను చూసి 'బంగారు మురుగు' చదివాక ఇది చదివితే బాగుంటుందేమో అని ఆగాను. ఎందుకంటే, ఈ మధ్యే 'మిథునం' కథల పుస్తకం కొన్నాను. అందుకని ఆ కథ చదివేసి వచ్చి మళ్లీ చదువుతా మీ పోస్టు! ;-)

నేస్తం చెప్పారు...

ఇది శ్రీకాకుళం,వైజాగ్ వైపు ఉన్న యాస కదా శేఖర్.. భలే రాసారు.. ఇంకా బోలెడు అభినందనలు.. మీ బ్లాగ్ కి వచ్చినపుడల్లా ఆ తాబేళ్ళకు మేత పెడుతూ కాసేపు ఆడి వెళ్తా :)

సవ్వడి చెప్పారు...

congrats..

శ్రీను .కుడుపూడి చెప్పారు...

శేఖర్ గారు !అభినందనలు .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@శిశిర గారు,
@సిరిసిరిమువ్వ గారు,
@సునీత గారు,
@స్వప్న గారు,
@చిన్ని గారు,
@వంశీ కృష్ణ,
@ఎస్సార్ రావు గారు,
@నెలబాలుడు గారు,
@స్రవంతి గారు,
@పద్మార్పిత గారు,
@కార్తీక్ గారు,
థాంక్యూ!...

@మురళి గారు,
మీ భావోద్వేగం అర్ధం అయిందండి...
థాంక్యూ..

@సుజాత గారు,
థాంక్యూ సో మచ్..

@రవి చంద్ర గారు,
ఏటిగట్టు మీకు సాదర స్వాగతం పలుకుతోంది...మీ అభినందనలు అందుకున్నానండి
థాంక్యూ..

@'హార్ట్ స్ట్రింగ్స్' అపర్ణ గారు,
నాకు కూడా వ్యక్తిగతంగా ఆ టపానే ఇష్టమండీ..అన్ని టపాలు చదివి అభిప్రాయం తెలిపిన
మీకు బోల్డన్ని థాంకులు...

@జయ గారు,
తప్పకుండా...
త్వరలో ఏడుపెంకులాట రాస్తానండీ...:)
థాంక్యూ..

@కొత్తపాళీ గారు,
థాంక్సండీ...

@ఉష గారు,
చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కనిపించారు...
థాంక్యూ..

@జాన్ గారు,
థాంక్యూ..అవునండీ ఈనాడు పుణ్యమాని మీలాంటి మిత్రులు కూడా పరిచయం అయ్యారు..

@మోహన గారు,
'ఒక్కళ్ళు కూడా టపా చదవలేదేమో..ఒకవేళ చదివినా నచ్చలేదేమో' అన్న అనుమానంతో ఉన్న నాకు స్ట్రైయిట్ గా టపా మీద మీరు రాసిన కామెంట్ చదివి చాలా ఆనందం కలిగింది...
థాంక్యూ....

@జ్యోతి గారు,
@కౌండిన్య గారు,
@సవ్వడి గారు,
@తువ్వాయి గారు,
థాంక్యూ..

@డెబో,
నువ్వు చెప్పింది కరెక్ట్...అయినా నువ్వు మన లాంగ్వేజ్ అనకుండా మా లాంగ్వేజ్ అన్నందుకు నేను హర్ట్ అయ్యా..:-)
థాంక్యూ..

@మధురవాణి గారు,
అబ్బే..బంగారు మురుగుకు, నా టపాకు ఏమీ సంభందం లేదండీ...ఒక్క బామ్మ అనే కాన్సెప్ట్ తప్ప...'మిధునం' కొన్నారా..చదవండి...చాలా బాగుంటాయి కధలు..( అబ్బ..ఎన్నాళ్ళకు నాకు కూడా ఇంకొకరికి ఫలనా పుస్తకం చదవండి అని చెప్పే చాన్స్ వచ్చింది..థాంక్స్ టు మురళి గారు..)
మీ అభినందనలకు థాంక్యూ..

@నేస్తం జీ,
అవునండీ..అక్కడ యాసే...చిన్నప్పుడు మా కాలనీలో పెద్ద వాళ్ళు అందరూ ఉద్యోగస్తులే అవ్వటం వల్ల, వాళ్ళ పిల్లలెవరూ యాసతో మాట్లాడేవారు కాదు...ఏదో నేను గుడిసెలో ఉన్న పిల్లలతో కాస్త రాసుకు,పూసుకు తిరగబట్టి ఈ మాత్రం యాస అయినా తెలిసింది..అందుకే తెలియని చోట ఎలాగో మేనేజ్ చేసేసాను టపాలో...కొన్ని యాస మిస్టేక్లు కూడా ఉంటాయి..:-)
నా తాబేళ్ళకు మేత పెడుతున్నందుకు, అభినందనలు తెలిపినందుకు బోల్డన్ని థాంకులు మీకు...

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ముందుగా హృదయపూర్వక అభినందనలు శేఖర్ గారు.. గత నాలుగు రోజులుగా ఊపిరి సలపనంత బిజీగా ఉండటంతో కాస్త ఆలశ్యమైంది మరోలా అనుకోవద్దు :-)

ఇక మీదైన శైలి లో ఈ టపా ద్వారా ఈ ఆనందాన్ని మాతో పంచుకోవడం మరింత బాగుంది. నేకూడా మీ బామ్మ గారితోనూ మీతోనూ కలిసి ఓ పాలి ఆకాశం నెం తొమ్మిది ఎక్కేసొచ్చినట్లైపోనాదంటే నమ్మండి :-)

మాలా కుమార్ చెప్పారు...

అభినందనలు .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@వేణు శ్రీకాంత్ గారు
మీ బిజీ షెడ్యూల్ ని సాటి సాఫ్ట్ వేర్ కూలీగా నేను ఆ మాత్రం అర్ధం చేసుకోలేనా చెప్పండి...:-)

ఓసోస్..మీరు కూడా తొమ్మిదో ఆకాశంలోకి ఎలుపొచ్చేసారేటి...మరి నాను ఆడే కదా ఉన్నాను..ఏటి మాటాడక పల్లకూరుకున్నారేటి? :-)
థాంక్యూ...

@మాలా కుమార్ గారు
థాంక్సండి..

రాధిక చెప్పారు...

మీకు హృదయపూర్వక అభినందనలు శేఖర్ గారూ

మంచు చెప్పారు...

హృదయపూర్వక అభినందనలు శేఖర్

మంచు చెప్పారు...

ఈ తాబేళ్ళకి మేత పెట్టొచ్చు అని తెలీదే.. ఎదొ తిరుగుతున్నాయ్ అనుకున్నా.. ఎప్పుడూ గమనించలేదు..

Unknown చెప్పారు...

ఇంత మంచి తెలుగు సాహిత్యం చదివి చాన్నాళ్ళు అవుతుంది. మీ ఈ కథను చదివినపుడు నాకు మా నానమ్మ గారి ఇల్లు అలా కొన్ని నిమిషాలు నా ముందర నిలిచింది. చాలా బాగా రాసారండి మీరు. Your writing style is very natural and I could identify myself with and picture it quite easily. Thank you so much for this excellent respite from our speedy lives.

సవ్వడి చెప్పారు...

శేఖర్ గారు చాలా సరదాగా రాసారు. ఈనాడులో చదివి మీకు కంగ్రాట్స్ చెప్పడానికే నాకు టైమ్ దొరకలేదు. ఇంక చదివేది ఎప్పుడు. ఇప్పుడు చదివాను.
మన భాషని, మన యాసని బాగా రాసారు. మొదటిసారిగా మన యాస నచ్చింది. ఇంతవరకూ మన యాసని ఇష్టపడేవాడిని కాను. సినిమాల ప్రభావం లేకపోతే మిగతా ప్రపంచం ప్రభావం. కాని ఇప్పుడి చెప్తున్నా... మన యాసే యాస.. ఈ క్షణం నుంచి ఇష్టపడుతున్నా!
ఓలమ్మా... శేఖర్ అన్నీ సరీగా సెప్పేసినాడే... మీరు రాసిన పదాలన్నీ కరక్టే!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

'స్నేహమా' రాధిక గారు,
మీరు చాలా రోజులకు ఇటువైపు రావటం, అభినందనలు తెలుపటం నాకు చాలా ఆనందంగా ఉందండి. థాంక్యూ!..

@మంచు పల్లకీ గారు,
థాంక్సండి..
ఈ సారెప్పుడైనా నా నేస్తాలకు(తాబేళ్ళకు) మేత పెట్టడానికి ట్రై చేయండి...అల్లరి చేయకుండా ఎంత బుద్దిగా తినేస్తాయో అవి..:)

@megs
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్సండి..
నా టపా మీకు అటువంటి ఫీల్ ని కలిగించిందంటే నాకు చాలా ఆనందంగా ఉందండి...

@సవ్వడి గారు,
యాసతో కూడిన భాష ఏ ప్రాంతానికి చెందినదైనా చాలా బాగుంటుందండి..కాకపోతే ఈ సినిమావాళ్ళు దాన్ని వెటకారం చేసి చూపటం, ఊరి భాష అంటే పలుచనగా చూసే కొంతమంది వల్ల మీకు అటువంటి అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు..ఎనీవేస్ ఇప్పుడు మీరు మన ఊరు యాసని ఇష్టపడుతున్నందుకు చాలా హ్యేపీగా ఉంది...
థాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్...

మధురవాణి చెప్పారు...

@ శేఖర్ గారూ,
బంగారు మురుగు కథా, మీ టపా రెండూ చదివానండీ!
ఇద్దరు బామ్మలూ నచ్చారు నాకు.
నాక్కూడా ఆ పెసరట్టు, కొబ్బరి పచ్చడి తినే అవకాశం కలిపిస్తే మరి నేను కూడా cloud 9 మీదకి వచ్చేద్దును కదా అనిపిస్తోంది. అసలే పెసరట్టు నా ఫేవరెట్ మరి! ;-)
అన్నట్టు, 'మిథునం' పుస్తకం అంతా చదివానండీ! అన్నీ కాకపోయినా కొన్ని మంచి కథలున్నాయి పుస్తకంలో :-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మధుర వాణి గారు,
అవునండి..మిధునంలో కొన్ని కధలు మాత్రమే బాగుంటాయి...నేను మీతో హడావిడిలో అన్ని కధలు బాగుంటాయి అని అనేసాను..:-). నాకు అన్నింటికన్నా 'షోడానాయుడు','మిధునం','బంగారుమురుగు', 'ధనలక్ష్మి' కధలు బాగా నచ్చాయి..
ఈ సారి మీరు ఇండియా వస్తే మీకు స్పెషల్ పెసరట్టు, స్పెషల్ కొబ్బరి పచ్చడితో బ్రేక్ ఫాస్ట్ అరేంజ్ చేస్తానులెండి...:-)
అన్నట్టు మీరు నా పేరు చివర 'గారు' అని చేర్చి పేరు బరువు పెంచేస్తున్నారు...:)

మధురవాణి చెప్పారు...

@ శేఖర్ గారు,
మీరు 'గారు' తీసేస్తే నేను కూడా తీసేస్తాను. హీ హీ ;-)
'మిథునం' పుస్తకంలో అచ్చంగా మీరు చెప్పిన కథలే నాకు నచ్చింది కూడా! 'వరహాల బావి' కథ చదువుతున్నప్పుడు ఫీల్ బాగుంది. అంటే, ఆ పల్లెటూరి నేపథ్యం అదీ నచ్చింది కథ అంత ఆకట్టుకోకపోయినా! మిగతావి కొంచెం బోర్ అనిపించాయి.
బ్రేక్ ఫాస్ట్ పార్టీ ఇస్తానన్నందుకు థాంక్స్ :-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మధురవాణి,
అయితే ఓ.కే :-)
వరహాలబావి నేపధ్యం నాకు కూడా బాగా నచ్చింది...అందులో నూతి వర్ణన నాకు చాలా ఇష్టం...

ప్రణీత స్వాతి చెప్పారు...

శేఖర్ గారూ..బ్లాగ్ మిత్రులందరూ మీకు కంగ్రాట్స్ చెప్పేశారు. బహుశా నేనే ఆఖరి మెంబర్ నేమో..కానీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. మీరు వెళ్లి కూర్చున్న 9th ఆకాశానికి వచ్చి మరీ చెప్తున్నా.. అందుకోండి నా శుభాభినందనలు. ఎప్పుడూ ఇలాగే చకచక్కటి టపాలు రాస్తూ..నవ్వుతూ నవ్విస్తూ...వుండాలని..ఆకాంక్షిస్తున్నా.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@ప్రణీత గారు,
లేట్ గా వచ్చి చెప్పినా లెటెస్ట్ గా చెప్పారండీ మీరు...:)
థాంక్యూ..

కొత్త పాళీ చెప్పారు...

తాంబేళ్ళకి మేతెయ్యాలని నాకూ తెలీదిప్పటిదాకా .. పాపం మీరు పైనే చెప్పినా ఏదో ఆసికానికనుకున్నా .. నేను సైతం తాంబేళ్ళకి మేత పెట్టితినీ ..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@కొత్తపాళీ గారు,
మీలానే చాలా మంది పొరబడ్డారండీ నా నేస్తాల విషయంలో...మీరు కూడా మేత వేసారన్నమాట...మీరు తాంబేళ్ళు అని అంటుంటే భలే ముద్దుగా వినిపిస్తుంది నా చెవులకి...
థాంక్యూ..

S చెప్పారు...

నేను ఈమధ్య ఈనాడూ చూడలేదు -ఎప్పుడూ మీబ్లాగూ చూడలేదు. ఇవాళే ఒక స్నేహితురాలు చెబితే ఈటపా చూశాను. బాగుందండీ! కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్.
-విబిసౌమ్య

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@సౌమ్య గారు,
థాంక్యూ..మీకు నా బ్లాగు పరిచయం చేసిన మీ స్నేహితురాలికి కూడా చాలా థాంక్స్.