కాలేజీ రోజుల్లో ఎవరైనా ఆత్మాభిమానం / అహం దెబ్బతిన్నట్టు మాట్లాడితే వెంటనే తగిన విదంగా స్పందించేవాడిని. అలా స్పందించటం వల్ల కొంతమందికి దూరమైనా తృప్తిగా వుండేది. ఎందుకో అలా మనుషులను దూరం చేసుకోవటం సరైన పద్దతి కాదని సిటీ బతుకు నుండి నేర్చుకున్నాను. ఇక్కడే తప్పు జరిగి పోయింది. ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి మార్పు తెచ్చుకున్నానని నాకు అప్పుడు తెలియదు. అలా ఆత్మాభిమానాన్ని కొద్ది కొద్దిగా వదులుకోవటం ద్వారా, చుట్టూ వున్న వాళ్లు ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టు మాట్లాడిన పెద్దగా ఏమీ స్పందన ఇచ్చేవాడిని కాదు ఎక్కడ వారు దూరం అవుతారోనన్న ఆలోచనతో. ఈ క్రమంలో నన్ను నేను పూర్తిగా కోల్పోయాను. నేననుకున్నట్టుగానే ఇదివరకటిలా మనుషులు దూరం అయ్యేవారు కాదు. కొంతమంది ఈ క్రమంలో మొదట్లో నేను నొచ్చుకున్నట్టు మాట్లాడినా తర్వాత్తర్వాత నన్ను నన్నుగానే తీసుకునే వారు. కాని ఎక్కువ మంది ఈ అవకాశాన్ని అలుసుగానే తీసుకున్నారు. ముఖ్యంగా నేను పని చేసే చోట. మనిషి వ్యక్తిత్వంలో ఒక విలువైనది కోల్పోవటంవల్ల మనం మనల్ని ఎలా కోల్పోతామో కొన్ని అనుభవాలు , సంఘటనల ద్వారా తెలిసింది. తెలిసింది అనేకంటే నా మిత్రుడు నా ముందు అద్దంలా నిలబడి నన్ను నాకు చూపించాడు అనటం సబబుగా వుంటుందేమో.
ఇప్పుడు నేను నేనుగానే వుంటున్నాను. చాలారోజుల కిందట కోల్పోయినది ఏదో మళ్ళీ నాకు దొరికినట్టు వుందిప్పుడు.
చుట్టూ వున్నవాల్లందరూ ఇప్పుడు నాకు అవసరం లేదు. నన్ను నన్నుగా తీసుకునేవారు మాత్రమే నాకు కావాలిప్పుడు. మనం కావాలనుకునే వారు తప్పకుండా మన ఇబ్బందులను గమనించి నడుచుకున్టారన్న నమ్మకం వుందిప్పుడు.
OTT Entertainment : 2
3 వారాల క్రితం
2 కామెంట్లు:
ఎంత బాగా చెప్పారండి..ఎప్పుడూ సరదాగా హాస్య చతురతతో వుండే శేఖర్ గారిని చూసే అలవాటు కదండీ . అందువల్ల మీలో ఇంత డెప్త్ (తెలుగులో సరైన మాట దొరకలేదు) అసలు వూహించలేకపోయాను.
@ప్రణీత గారు,
అది నా స్వంత అనుభవం కాదండీ. నా స్నేహితుడి ఆవేదనకు అలా అక్షరరూపం ఇచ్చి మొదటి టపాగా పెట్టేసాను. మనదంతా కన్నుకి కన్ను, పన్నుకి పన్ను టైపు అప్రోచ్ లెండి. అంత సాగతీత ఉండదు మరి. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి