16, అక్టోబర్ 2009, శుక్రవారం

చీకటి వెలుగుల రంగేళి...



మా ఊళ్ళో దీపావళికి ఓ నెల రోజుల ముందునుండే వీదిలో ఉండే షాపుల్లో రంగు రంగుల, రకరకాల గన్ లు అమ్మేవారు. రోజూ స్కూలుకి వెళుతూ ఆ గన్ ల వైపు ఆశగా చూడటం...ఎప్పుడు నాన్న అవి కొంటారో అని ఓ నిట్టూర్పు విడిచి మళ్ళీ స్కూలువైపుకి అడుగులు పడటం...ఇలా నాన్న గన్ కొనేంత వరకు ఎదురుచూపులు తప్పేవి కావు నాకు. అయితే అమ్మ మాత్రం దీపావళి చాలా రోజులు ఉందనగా గన్ కొననిచ్చేది కాదు...ఎందుకు ఇంత తొందరగా కొనేయటం..మద్యాహ్నాలు పడుకోకుండా ఢాం..ఢాం అంటూ గన్ లు పేల్చుకుంటూ టాపులేపేస్తారు పిల్లలందరూ కలసి అని నాన్నతో అనేది.

అయితే మా కాలనీలో పిల్లలందరూ అప్పటికే కొనుక్కుని పోటా పోటీగా గన్ లో కేపులు పెట్టి కాల్చేవారు. ఒక్కొక్కడు చేతిలో ఉన్న గన్ లతో హీరోల్లాగా ఫీలయిపోయేవారు. అందరు ఇళ్ళల్లోనూ లో క్వాలిటీ అంతగా ఉండని, నల్లరంగు వేసి ఉన్న గన్ మాత్రమే కొని పేట్టేవారు. దీని ధర మూడు రూపాయలే ఉన్నందున ఎవరింట్లోనూ ఆరు రూపాయల ధరతో టిప్ టాప్ గా కనిపించి మెరిసే బాడీ ఉన్న స్టీలుగన్ కొనేవారు కాదు. పిల్లలందరిలో ఎవరి దగ్గరైతే ఆ స్టీలు గన్ ఉంటుందో వాడు 'దొంగా పోలీస్' ఆటలో ఎప్పుడూ పోలిసే అన్నమాట. నాసిరకం నల్ల రంగు గన్ లు ఉన్నోళ్ళకు ఎప్పుడోగానీ పోలీస్ అయ్యే చాన్స్ వచ్చేదికాదు.

అయితే గన్ లు కొనుక్కోవటం ఒక ఎత్తైతే దానిలో కాల్చడానికి పెట్టే కేపులు కొనుక్కోవటం ఇంకో ఎత్తు. నేనైతే అమ్మ దగ్గర నుండి ఓ పావలా రాబెట్టడానికి చాలా కష్టపడాల్సివచ్చేది. తీరా అమ్మ పావలా ఇచ్చే టైంకి నా స్నేహితులందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఇచ్చే పావలాతో అప్పటికే కేపులు కొనేసుకుని ఎగా దిగా, పోటా పోటీగా కాల్చేసి, కేపుల డబ్బా అయిపోయిన వెంటనే ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, బోరుకొట్టేసి ఏ ఇసకలోకో ఆడటానికి పోయేవారు. మరి నేను ఒక్కడినే గన్ కాలిస్తే మజా ఏమి ఉంటుంది..అందుకని తర్వాత రోజుకి కేపులు ఉంచుకుని ఆడుకోవడానికి నేను ఆ మట్టి దగ్గరకే పోయేవాడిని.

కేపులు రెండు రకాలుగా దొరికేవి. బొట్టుబిళ్ళంత సైజులో విడి విడిగా ఉండి ఓ గుండ్రటి చిన్న డబ్బాలో వాటిని పేక్ చేసి అమ్మేవారు. అందులో సగం పైగా కేపులకి మందు ఉండేది కాదు. రెండో రకం కేపులు రీలు మాదిరి ఉండేవి. ఇవి కొంచెం ఖరీదైనవి. మామూలు కేపులు పావలాకి ఒక డబ్బా వస్తే రీలు టైపు కేపులు ముప్పావలా ఖరీదు ఉండేవి. రీలు కేపులు ఒక్కసారి గన్ లో లోడ్ చేస్తే ఢాం..ఢాం అని కంటిన్యూస్ గా కాల్చవచ్చు. తొందరగా అయిపోతాయి కూడా...వాటితో మేము ఊహించుకుంటున్న హీరోయిజం వచ్చేది. అయితే అందరిళ్ళల్లోనూ పావలానే మొహాన కొట్టేవాళ్ళు. గుండ్రటి కేపులు విడి విడిగా ఉండి ఒకటి తర్వాత ఒకటి గన్ లో పెట్టుకుని కాల్చుకోవటం వల్ల ఎక్కువ టైం పట్టి ఆరోజు గడిచిపోయేది. మళ్ళీ మళ్ళీ పావలా అని అదే రోజు ఇంట్లో వాళ్ళని పీక్కుతినే అవకాశం ఉండేది కాదు.

గన్ లు కొద్ది రోజులకే పాడయ్యేవి...పాడయ్యేవి అనేకంటే మేము దాన్ని అదే పనిగా కాల్చటంతో దీపావళి రాకముందే హరీ అనేవి...అప్పుడు మాత్రం మేము తగ్గుతామా....ఒక నట్టు, బోల్టు తీసుకుని నట్టు మీద గుండ్రటి కేపు పెట్టి దాని మీద బోల్టు బిగించి పై నుండి వదిలితే అది ఢాం..అంటూ పేలేది. ఈ ప్రాసెస్ గన్ తో పోలిస్తే కొంచేం ఈజీ...గన్ లు బాగా ఉన్న పిల్లకాయలు కూడా ఈ పద్దతికి వచ్చేసేవారు...ఇక చూడండి..పెద్దవాళ్ళ గుండెల్లో రైల్లు పరిగెత్తేవి...ఏ స్కూటర్కో లేక సైకిల్ కో ఉన్న నట్లు..బోల్టులు తీసేస్తామేమో అని....పిల్లకాయల కళ్ళు ఎక్కడ నట్టు దొరుకుతుందా అని వెతికేవి.

కాస్త ఎదిగి నిక్కర్లు వేసుకునే వయసు నుండి ప్యాంట్ వేసుకునే వయసు వచ్చేసరికి మందు కొనుక్కుని మేమే చిచ్చుబుడ్లు, మతాబులు తయారు చేసుకునేవాళ్ళం..అందుకే దీపావళికి కొన్ని రోజులు ముందు ఆ హడావిడి ఉండేది. అప్పటికి చెడ్డీలేసుకున్న కుర్రోళ్ళందరూ గన్ లు కాల్చుకుంటూ మాకు వారసులుగా తయారు అయ్యేవారు. అప్పుడు చూడాలి...మేము వాళ్ళు మా ముందు గన్ లు కాలిస్తే వాళ్ళ చేతిలోని గన్ లు లాగేసుకుని ఏడిపించేవాళ్ళం. ఏరా..ఇంకోసారి మనుషులకి దగ్గరగా కాలుస్తారా అని వార్నింగ్ ఇచ్చి వదిలేసేవాళ్ళం. వాళ్ళు కాస్త భయపడి దూరంగా వెళ్ళి కాల్చుకునేవారు. మేము మాత్రం అప్పుడే వస్తున్న మీసాలను మెలేసుకుని చిన్నపిల్లలకు భయపేట్టేమంటే మనం పెద్దవాళ్ళం అయిపోయినట్టేరా అని అనుకునేవాళ్ళం. రాత్రి వెలిగించే చిచ్చుబుడ్లు తయారు చేసుకున్నవి కావటంతో చాలా సేపు వెలిగేవి. అవి అంతసేపు కాలటం చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తే గొప్పగా అనిపించేది. ఇలా పదో తరగతి దాకా ప్రతీ దీపావళికి చిన్న చిన్నవిగా అనిపించే గొప్ప ఆనందాలు మా సొంతం.

కాలేజీకి వెళ్ళే వయసులో మా దీపావళి ఆనందాలను వీక్లీ ఎగ్జామ్స్, ఎంసెట్టు హరించేసేది. ఆ తర్వాత ఇంజనీరింగ్..మా దురదృష్టమో ఏమో గానీ మా సెమిష్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడూ దీపావళి టైంలోనే పడేవి. ప్రపంచం అంతా కాలుస్తుంటే బుక్కు ముందేసుకుని చదువుతున్నప్పుడు నాలో ఒక అపరిచితుడు బయటకు వచ్చేవాడు... డిగ్రీ అయ్యాక ఉద్యోగాలు వెంటనే రాకపోవటం...అది కలిగించే అభద్రత..ఇంకెవడికో మనకంటే ముందే వచ్చేసిందన్న భాద..వెరసి ఇవన్నీ బోల్డంత ఫ్రీ టైం ఉన్నప్పటికీ దీపావళి వచ్చినా ఎంజాయ్ చెయ్యాలన్న మనసు ఉండేది కాదు... ఆ తర్వాత ఇంక చెప్పేదేముంది? ఉద్యోగాలు రావటం...మన పక్కింటోడు ఏం చేస్తాడో కూడా తెలుసుకోలేని బిజీ జీవితాలు...ఇంటికి దూరంగా ఉండటం వల్ల దీపావళి అనే ఒక పండగ వచ్చి పోయింది అని అనుకునే వరకే ఉండేది పండగ సంబరం...పండగ పూట కూడా ఆఫీసుల్లో పని చేయటాలు లాంటివి దీనికి అదనం...

అందుకే అన్నారు ఓ పెద్దాయన....చీకటి వెలుగుల రంగేళి....జీవితమే ఒక దీపావళి...

బ్లాగ్మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు

31 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

మీకు నా దీపావళి శుభాకాంక్షలు!

Hima bindu చెప్పారు...

బాగున్నాయండీ మీ జ్ఞాపకాలు ...గన్ మొతంటే చెవులు మూసుకుంటాను అప్పుడు ఇప్పుడూ ....మా తమ్ముళ్ళు ఇద్దరు హీరోల్లా షూట్ చేసేవాళ్ళు ... చివరి వాక్యం మరీ బాగుంది .

Hima bindu చెప్పారు...

బాగున్నాయండీ మీ జ్ఞాపకాలు ...గన్ మొతంటే చెవులు మూసుకుంటాను అప్పుడు ఇప్పుడూ ....మా తమ్ముళ్ళు ఇద్దరు హీరోల్లా షూట్ చేసేవాళ్ళు ... చివరి వాక్యం మరీ బాగుంది .

భావన చెప్పారు...

దీపావళి కి ముందు నేను కూడా కాల్చేదాన్ని ఆ పిస్తోలు.. ఎవరైనా గోరు తో ఆ బిళ్ళ కొడితే వాళ్ళు హీరో లు అప్పట్లో.. బాగా గుర్తు చేసేరు. ఎంత బాగా చెప్పేరు. అంతే కదా.. జీవితమంటే చీకటి వెలుగు ల దీపావళి. హ్మ్మ్. ఏమిటో..
మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.

తృష్ణ చెప్పారు...

మేమూ తుపాకీలు కాల్చేవాళ్ళమ్...నేను చెవులు మూసుకుని మరీను...చిన్న చిన్న రౌండ్ వాటిని మేము ఒక పెద్ద రాయి తెచ్చుకుని పేల్చేవాళ్లమ్..అదీ చెవులు మూసుకునే...those are very delightful memories..

తృష్ణ చెప్పారు...

ఈ టపా క్రెడిట్ అంతా నాదేనండోయ్... మరి నా దగ్గరకు వచ్చాకా కదా మీరూ మీ చిన్ననాటి ముచ్చట్లు ఇలా ఇంత బాగా మాతో పంచుకున్నారు...

భావకుడన్ చెప్పారు...

Nice Reminiscences...took me back decades.....Thanks a lot...మీక్కూడా సకుటుంబంగా దీపావళి శుభాకాంక్షలు.

Padmarpita చెప్పారు...

బాగున్నాయండీ మీ జ్ఞాపకాలు....
మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.

SRRao చెప్పారు...

మళ్ళీ గుర్తుచేసారండి చిన్నతనాన్ని, ఈసారి దీపావళి రోజు వర్షం పడడన్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. కానీ నిన్న సాయింత్రం నుంచే తీపి జ్ఞాపకాల జడివానలో తడిసి పోతున్నాం. ఇలా అనుభూతులు, భావాలు పంచులోవడం అద్భుతం. శుభాకాంక్షలతో....

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీ కుటుంబానికి కూడా దీపావళి శుభాకాంక్షలు.

amma odi చెప్పారు...

మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని కోరుతూ.....దీపావళి శుభాకాంక్షలు!

Maruti చెప్పారు...

మీకు, మీ కుటుంబసభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@ధరణీరాయ్ చౌదరి గారు,
మీకు కూడా...ధన్యవాదాలు.

@చిన్నిగారు,
థాంక్సండీ..మీరు కూడా మా ఇంట్లో వాళ్ళలాగ గన్ భాదితులే అన్నమాట.

@భావనగారూ,
అవునండీ..మా గ్యాంగ్ లో ఒకడు అలానే గోటితో పేల్చి గోటి మీద బాగం కొంచెం కాలేసరికి ఇంకెప్పుడూ మేము అలా ప్రయత్నంచలేదు.
దీపావళి శుభాకాంక్షలు.

@తృష్ణక్క,
నూటికి నూరు శాతం క్రెడిట్ మీదే...అందులో సందేహం లేదు..నిన్నంతా ఆఫీస్లో పని ఎప్పుడౌతుందా..ఎప్పుడు రాస్తానా అని ఎదురుచూసాను. పని వత్తిడిలో ఎక్కడ మూడ్ మారుతుందేమో అని భయపడ్డాను కూడా..మా అక్కలందరూ కూడా మీలాగే రాయి ఉపయోగించి కేపులు పేల్చేవారండి..
మీరన్నట్టు నిజంగా అవి డిలైట్ఫుల్ మొమొరీస్..
థాంక్యు..

@భావకుడన్ గారు,
మీరు కూడా ఓసారి అలా వెనక్కి వెళ్ళినందుకు ఆనందంగా ఉంది. దీపావళి శుభాకాంక్షలండీ..ధన్యవాదాలు.

@పద్మ గారు,
థాంక్సండి..మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు..

@SRRao గారు,
@విజయమోహన్ గారు,
@Amma Odi గారు(సారీ..మీ పేరు తెలీదండీ),
@మారుతి గారు,
థాంక్సండీ..మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలండీ..

sunita చెప్పారు...

బాగున్నాయండీ మీ జ్ఞాపకాలు!!దీపావళి శుభాకాంక్షలు...

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

దీపావళి శుభాకాంక్షలు!

జయ చెప్పారు...

అవునండి, ఆ గన్ లతో పేలుస్తుంటే, ఏదో పెద్ద హీరో ఫీలింగ్ కూడా వొచ్హేసేది. అయినా! ఆ చిన్నప్పటి రోజులే వేరులెండి. మళ్ళీ రమ్మన్నా రావుకదా!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@సునీత గారు,
@వంశీ గారు,
థాంక్సండి..మీకు కూడా పండుగ శుభాకాంక్షలు..

@జయ గారు,
కరెక్ట్ గా చెప్పారండీ..క్వాలీటీ తో కూడిన లైఫ్ అంటే అది చిన్నప్పుడు గడిపిన రోజులే అని నాకు కూడా గట్టి నమ్మకం..నెనర్లు.

మాలా కుమార్ చెప్పారు...

మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .

మురళి చెప్పారు...

మీ టపా చదవగానే నాక్కూడా ఒక గన్ను కొనుక్కోవాలనిపించింది..నిజం.. అన్నట్టు మీ నేస్తాలకి మేత పెడుతూ చదవడం వల్ల మామూలు కన్నా ఎక్కువ టైం తీసుకున్నానీసారి.. అవునండీ.. పండుగ వస్తే కనీ మీ నుంచి టపా రాదా? (వినాయక చవితికి రాశారు సరే.. దసరాకి డుమ్మా కొట్టారు కదా) సంక్రాంతి వరకూ వెయిట్ చేయించకండి, బాగోదు..

నేస్తం చెప్పారు...

చక్కని టపా :)
మీకు, మీ కుటుంబసభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

నేస్తం చెప్పారు...

చక్కని టపా :)
మీకు, మీ కుటుంబసభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మాలా కుమార్ గారు.
థాంక్యు. మీకు కూడా పండుగ శుభాకాంక్షలు.

@నేస్తం గారు,
థాంక్సండి.

@మురళి గారు,
నా నేస్తాలుకి మీరు మేత వేసి, టపా చదవటంతో పాటు వాటిని పలకరించినందుకు మీకు థాంకులు.

అయ్యో లేదండీ..రెండు మూడు కొత్త టపాలు రాసాను. కాకపోతే అవి ఇంకా డ్రాఫ్ట్ లాగే ఉన్నాయి. రాసాక నాకే నచ్చక కొంచెం తుది మెరుగులు దిద్దుదామని పబ్లిష్ చెయ్యకుండా వదిలేసాను. మీరు అలా బెత్తం చూపించి చెప్పేరు కాబట్టి వీలువెంబడి అవి ప్రచురించేస్తాను. :)

sreenika చెప్పారు...

సేమ్ టు సేమ్. ఇంచుమించు ఇలానేవుండేవి. ఆడపిల్లనయినా తాతయ్యనన్ను మగపిల్లడిలానే ట్రీట్ చేసేవారు. గన్నులు చిన్న చిన్న సినిమా ఫైటింగులు అబ్బో చాలా గుర్తొచ్చేస్తూన్నాయి.

మాలా కుమార్ చెప్పారు...

మీ నేస్తాలు చాలా ముద్దుగా వున్నాయండి . మామనవడి కి చూపిస్తే వాడికి అలాంటివి కావాలని గోల చేస్తున్నాడు .వాడి డెస్క్ టాప్ మీద పెట్టుకుంటాడట. మీకు అభ్యంతరము లేకపోతే ఎలా తెచ్చుకున్నారో చెప్పగలరా ప్లీస్ .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@మాలా కుమార్ గారు,
అది ఒక గూగుల్ గాడ్జట్ అండీ..దాన్ని డెస్క్ టాప్ మీద పెట్టుకోవటం కుదరదు...బ్లాగుల్లో, వెబ్సైట్ లలో మాత్రం పెట్టుకోగలం. ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన విధంగా రంగులు అద్ది దిగువున Get the Code అన్న బటన్ ని క్లిక్ చేసి, కోడ్ ని కాపీ చేసుకుని, మీ బ్లాగు లేఅవుట్ దగ్గరకు వెళ్ళీ, 'గాడ్జట్ ని చేర్చు' అని ఆప్షన్ ని క్లిక్ చేసి, వచ్చిన కొత్త విండోలో Html/Java Script ని సెలక్ట్ చేసుకుని, మీరు కాపీ చేస్కున్న కోడ్ ని అక్కడ పేస్ట్ చేయండి. ఇంకా ఏమైనా సందేహం ఉంటే అడగండి.

@శ్రీనిక గారు,
ఆ వయసులో భయపడకుండా గన్ లు కాల్చేవారంటే మీరు ధైర్యవంతులే అన్నమాట.
థాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్.

కార్తీక్ చెప్పారు...

naaku kooda naachinnappati vishyaalu gurthuchessaru sekhar gaaru

baagindi....

www.tholiadugu.blogspot.com

పరిమళం చెప్పారు...

నాకూ గన్ లంటే భయమండీ ....గోడ టపాకాయలు మాత్రం పైనుండి కిందకు వేసేదాన్ని పదింటికి ఒకటి పేలేవి మీ టపా చిన్ననాటి ముచ్చట్లను గుర్తుకు తెచ్చింది :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@కార్తీక్ గారు,
థాంక్సండి.

@పరిమళం గారు,
గోడ టపాకాయలు మాత్రం పైనుండి కిందకు వేసేవాళ్ళా!! :) భలేవారే మీరు...

శివ చెరువు చెప్పారు...

deepavali vaste. pillalakentha saradano.. peddolaki pillala gurinchi antha bayam... ha hah..:)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@శివ చెరువు గారు,
అవునండీ..:)
థాంక్యు..

ప్రణీత స్వాతి చెప్పారు...

శేఖర్ గారూ బిలేటేడ్ దీపావళి శుభాకాంక్షలండీ..
నాది కూడా మురళీగారి మాటేనండోయ్..ఆలీసం చేసీకండి మరీ..కొత్త టపాలేట్టీయండీ..