నక్క చూపించిన రెండు కట్టేల్లో ఒక దాని మీద నిల్చుంది.
"ఎలా వెళ్ళాలబ్బా......మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటే ఎలా పోయేది చెప్మా.....ఛా..ఏమీ తెలియటంలేదు. అనవసరంగా పట్టుదలకు పోయేనా??...లేదు..లేదు...ఎలాగైనా ఆ నక్కకు బుద్ది చెప్పాలి, నా సామర్ధ్యం ఏంటో వీళ్ళకు తెలియాలి" అని అనుకుంటూ చుట్టూ చూసింది.
"ఓ.....అయిడియా వచ్చింది. ఇలా ప్రయత్నిస్తాను....నేననుకున్న వాటిల్లో ఇదే మంచి పద్దతి....దేవుడు నా కిచ్చిన అన్నింటినీ చక్కగా ఉపయోగించుకుంటాను" అని ఇంకో సారి మనసులో గట్టిగా అనుకుంది.
తనకొచ్చిన ఐడియాని ఒక క్రమపద్దతిలో అమలుపరుస్తూ ఉంది నత్త. కాళ్ళు ఒక కట్టెపై ఉంచి మొత్తం శరీరాన్ని ముందుకు కదిలించడానికి ప్రయత్నించింది.
ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. తన ప్రయత్నం ఫలిస్తుంది అన్న విషయం నత్తకు అర్ధం అయింది.
మొత్తానికి ఇటువైపు ఉన్న కట్టే మీదకు నత్త రాగలిగింది.
తన శక్తి సామర్ధ్యాలు కూడదీసుకుని నక్క చెప్పిన పనిని అందరిముందూ చేసి చూపించింది. తనను గేలి చేసిన వారి మాటలు తప్పని నత్త నిరూపించింది. చిన్నబోయిన నక్క జంతువుల మధ్య నుండి నెమ్మదిగా జారుకుంది. మిగతా జంతువులు నత్తపై తాము చూపించిన ప్రవర్తనకు సిగ్గుపడుతూ తమ కరతాళ ధ్వనుల మధ్య నత్తను సత్కరించాయి.
*****
### ఫోటోలు అంతర్జాలం నుండి తీసుకున్నవి.
8 కామెంట్లు:
బాగుంది
ఊఁ.. బాగుందండీ కథ.. ఫోటోలు చూసి అప్పటికప్పుడు అనుకున్నారు కదూ.. నాకైతే అలాగే అనిపించింది.. ఫోటోలు అంత చక్కగా కుదిరాయి మరి..
బాగుంది శేఖర్ గారూ..
'జిత్తుల' మారి నక్క అంటారనుకుంట.
good use of the pics :)
చాలా బాగా చెప్పారు ఫొటొస్ తోని
@సూర్యుడు గారు,
@కొత్తపాళీ గారు,
@నేస్తం గారు,
థాంక్సండి.
@మోహన గారు,
థాంక్సండి...మీ సూచన మేరకు సరిచేసానండి.
@మురళి గారు,
థాంక్సండి...అవునండి..మొదట ఫోటోలు చూసిన తర్వాత వాటికి ఒక చిన్న కధ కూర్చితే ఎలావుంటుందో అన్న ఆలోచన రాగానే వెంటనే రాసానండి.
ఎంతో బాగుందండి కధ..
కాని...బాబోయ్ మీ అందరిని చూస్తోంటే (చదువుతోంటే) భయమేస్తోందండి
నేను ఇలా ఇంత బాగా కాకపోయినా, అసలంటూ రాయగలనా మనసులో మాటలు అని..
chaala bagudi naaku chala anandamga undi...ee roju..emoteliyadu..we will meet soon..
కామెంట్‌ను పోస్ట్ చేయండి