*******
"ఈ ఎలక్షన్లో మేము అధికారంలోకి వస్తే తెలంగాణా తీసుకు వస్తాం, మా తాతగారు కే. సి. ఆర్ ఆశయాన్ని సాదిస్తాం" ఏదో వబ్సైట్లో న్యూస్ వింటున్నాడు సౌరబ్.
ఒరేయ్ సౌరబ్ ...మన బ్రిట్నీ ఆన్లైన్ ట్యూషన్ అయిపోయాక రోజూ ఎక్కడికో వెళ్తుంది..నీకేమైనా తెలుసా..కొడుకుని అడిగింది. ఓ అదా...ఉగాది వస్తుంది కదా...వెల్కం ఆర్ట్ నేర్చుకోడానికి వెళ్ళింది అని చెప్పి మళ్లీ న్యూస్ హెడ్ లైన్స్ చూడటంలో మునిగిపోయాడు. వెల్కం ఆర్ట్ ...అదేమీ ఆర్ట్ రా..నేనెప్పుడూ వినలేదే అని నికిత శర్మ ఆశ్చర్యకరంగా అడిగింది. అదేనండి...ముగ్గు పెట్టడం...మనం పిండితో ఇంటి ముందు వేసేవాళ్ళం కదా....ఇప్పుడు మట్టి వాకిట లేదు కాబట్టి సిమెంట్ గచ్చు మీద టాటూ లాగ వేస్తారన్నమాట...అని నిశల్య అత్తగార్కి వివరించింది.
*********
"అక్క..చూలు..నా కొత్త జీన్స్......మరేమో...టుడే...ఐ సా ఎ సింగింగ్ క్రో ( కోకిల )" అంటూ ముద్దు ముద్దు మాటలతో ఇంటి ముందు వెల్కం ఆర్ట్ వేస్తున్న బ్రిట్నీ ని చుట్టేసాడు రెండేళ్ళ రాం చరణ్. వంటింట్లో ఇంకా ఉగాది పచ్చడి చెయ్యలేదని నిశల్య తెగ కంగారు పడుతుంది. తనకు పచ్చడి సామగ్రి డెలివరీ అయిందో లేదో అని మెయిల్ ఇంకో సారి చెక్ చేసింది. సారి..వీ ఆర్ అనేబుల్ టు ఢిలివెర్..అన్న మెయిల్ చూసి కూర్చిలో అలా కూర్చుండి పోయింది. ఇంతలొ తన సెల్ కి వాయిస్ మెసేజ్ వచ్చిందని చూసి ఓపెన్ చేసింది. "మామిడి కాయలు, వేప పువ్వు దొరక్క ఉగాది పచ్చడి చెయ్యలేక పోయారా..అయితే మా స్వగృహ స్టోర్ లో ఇప్పుడే ఆన్లైన్ ఆర్డర్ చేయడి, థాంక్ యు..బీప్...బీప్...బీప్.." ఇది మెసేజ్. వెంటనే సౌరబ్ మెసేజ్ లో చెప్పినట్టు ఉగాది పచ్చడి ఆన్లైన్ లో బుక్ చేసాడు.
"ఇలాంటి పరిస్తితి వస్తుందని నా చదువుకునే టైం లోనే అనుకున్నాను...ఎవ్వరూ పచ్చదనం కోసం ఆలోచించేవారు కాదు....ఎక్కడి చెట్లు అక్కడే నరికి విల్లాలు నిర్మించారు. కాలుష్యాన్ని పెంచారు. అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు చిప్కో ఉద్యమం అని పర్య వరణం కోసం ఉద్య మించారు. ఆ తర్వాత అలాంటి వాటి గురించి ఆలోచించే నాదుడే కరువయ్యాడు. దాని పర్యవసానం ఇలా ఉంది. ఎక్కడో...కొన్ని కిలోమీటర్ల దూరంలో వేప..మామిడి చెట్లు....ఉన్న వాటిలో కొన్ని మాత్రమె పూత పూసి కాయలు దాకా వచ్చేది. మిగతావి కాలుష్య కోరల్లో చిక్కుకుని పిందె దశలోనే రాలిపోవటం..మరికొన్ని అసలు పూతే వెయ్యక పోవటం...వేపాకుది అదేపరిస్తితి...అసలు చెట్ల పరిస్థితే అలా ఉంది ఇప్పుడు. దాని ఫలితం....కాయలు, పువ్వుల కొరత....సంప్రదాయ పండుగలు జరుపుకోలేని పరిస్తితి...ఉగాది పచ్చడి కోసం ఆన్లైన్ బూకింగ్లు...." అంటూ బామ్మ నికిత శర్మ నిట్టూరిస్తూ అన్న మాటలు బ్రిట్నీ ఆసక్తిగా వింటోంది.
సంవన్ ఇస్ వెయిటింగ్ బిఫోర్ ది డోర్..సంవన్ ఇస్ వెయిటింగ్ బిఫోర్ ది డోర్....అంటూ ఇంట్లో ఉన్న డోర్ అలారం చెప్పటంతో బ్రిట్నీ వెళ్లి డోర్ తీసింది. మేడం...వి ఆర్ ఫ్రం స్వగృహ ఆన్లైన్ స్టోర్....హియర్ ఇస్ యువర్ ఉగాది చట్నీ..అంటూ ఉగాది పచ్చడి డెలివరీ అందించాడు. బామ్మ నికిత శర్మ అల్ప సంతోషం తో పరిగెత్తి పచ్చడి తీసుకుని ఇంటిల్ల పాదికీ ప్లాటినం చెంచాతో చేతిలో పెట్టింది. మొత్తానికి ఎలాగోలా పండగ జరుపుకున్నాం అన్న ఆనందం వారి మొహాల్లో కనిపిస్తుంది.

4 కామెంట్‌లు:
ఊహించి వ్రాసిన జరగబోయేది అదేనేమో!!!!
భాధగా ఉంది, అలా అన్నీ మాడ్రనైజ్ అయిపోతాయని...
నాదీ పద్మగారి కామెంటే .. ప్రస్తుతం పరిస్తితే సగం మీరు చెప్పినట్లే ఉంది ..ఉగాధి శుభాకాంక్షలు మీ కూటుంభానికి మీకు
2040 కి ఈ మాత్రం పరిస్థితి అయినా ఉంటే గొప్పే!! :) బాగుంది.
@padma4245 గారు,
@నేస్తం గారు,
మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@మోహన గారు,
కొంచమైనా ఉంటుందేమో అన్న ఆశతోనే రాసానండి. ఏమో....మీరన్నట్టే ఉండొచ్చేమో...
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి