23, ఆగస్టు 2009, ఆదివారం

మా ఇంటి గణపయ్య...బొజ్జ గణపయ్య
నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళ మీదకు దండు బంపు
కమ్మని నేయియను కడు ముద్దపప్పును
బొజ్జ విరగగ దినుచు పొరలు కొనుచు"పుస్తకాలు దేవుడు దగ్గర పెట్టండర్రా..!!" అమ్మ వంటిల్లో కుడుములు చేస్తూ అంది.

నేను, నా ఫ్రెండ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. ముసిముసిగా నవ్వుకున్నాం.

"
వయసులో పుస్తకాలు ఏముంటాయి ఆంటీ..కావాలంటే నా లాప్ టాప్ పెట్టనా..అందులో మా ప్రాజెక్ట్ ఉంది. ఎప్పటి నుండో ఉన్న మొండి బగ్గులు ఫిక్స్ అవుతాయేమో.. " మా ఫ్రెండు గాడు అమ్మతో అన్నాడు.

"
ఒరేయ్..నీ ప్రాజెక్ట్ లో బగ్ లు అన్నీ ఫిక్స్ అయిపోతే, అక్కడ క్లైయింట్ గాడు ఉద్యోగులను తగ్గించమని మైల్ కొడితే అసలుకే ఎసరు..నీ ఇష్టం మరి" అన్నానేను.

"
అవున్రోయ్...అలా అయితే మన బ్లాగులు లాప్ టాప్ లో ఓపెన్ చేసి పెట్టి వినాయకుడు దగ్గర పెడదాం" అన్నాడు వాడు.

మనసులో నేను- వీడికి కొంపదీసి మెదడు వాపు రాలేదు కదా! ఇంత క్రియేటివ్ గా ఆలోచించేస్తున్నాడేంటబ్బా!!

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో నా బ్లాగు, మోజిల్లాలో వాడి బ్లాగు ఓపెన్ చేసి వినాయకుడు దగ్గర లాప్ టాప్ పెట్టాం.

"
ఏంటర్రా..మాటలేనా..ఉండ్రాళ్ళు చుట్టే ఆలోచన ఏమైనా ఉందా" అన్న అమ్మ మాటలతో మా సోదికి కాస్త ఫుల్ స్టాప్ పెట్టి పనిలో పడ్డాము.

అప్పటి వరకు అమ్మ చుట్టి వదిలేసిన ఉండ్రాళ్ళు నున్నగా, గుండ్రంగా వస్తే మేమిద్దరం చుట్టిన ఉండ్రాళ్ళు అంగారక గ్రహంలో దొరికిన Objects లాగ వచ్చాయి.


ఫోటో తీసింది/కళ : తోట తరణి బ్రదర్స్ -- ఎవరా అని ఆశ్చర్యపోకండి...మా మిత్ర ద్వయం...అప్పుడప్పుడు అలా ఫీలవుతుంటాం లెండి :))


****


బ్లాగ్మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

19 వ్యాఖ్యలు:

ఉష చెప్పారు...

మరి కాస్త ఆ వుండ్రాళ్ళు pizza మాదిరి నొక్కక పోయారా, లాప్టాప్కి సరిజోడు :) మా ఇంటా అదే అవుతుందేమో, లేదా Harry Potter పెడతానని నా చిన్నది పేచి అయినా పెడుతుందేమో... తరణి గారికి పోటీ ఇచ్చేట్లువున్నారే? ;)

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

శేఖర్ గారూ మీకుటుంబానికి మీ మిత్రుని కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు.

...Padmarpita... చెప్పారు...

వినాయక చవితి శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

మీ గణపతి బాగున్నాడు. బ్లాగులోకంలో మీ ప్రయాణం నిర్విఘ్నంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా.

చిన్ని చెప్పారు...

"అవున్రోయ్...అలా అయితే మన బ్లాగులు లాప్ టాప్ లో ఓపెన్ చేసి పెట్టి వినాయకుడు దగ్గర పెడదాం" అన్నాడు వాడు.
భలే నవ్విచ్చారండి..అసలే కొంచెం మూడ్ ఆఫ్ లో వున్నాను ...మీ వినాయకుడి పూజ చాల నవ్విచ్చింది.

మోహన చెప్పారు...

>>మేమిద్దరం చుట్టిన ఉండ్రాళ్ళు అంగారక గ్రహంలో దొరికిన Objects లాగ వచ్చాయి.
హహహా...
ఫోటో బాగుందండీ, చాలా బాగా అలంకరించారు. మా ఇంట్లో అయితే పూజ అయ్యేసరికి వినాయకుడు పత్రి, పూలలో మునిగిపోతాడు. :D

ఇంట్లో ఉంటే సందడిగా పాలవల్లికి పసుపు రాయటం, కట్టడం, బొట్లు పెట్టడం, పళ్ళతో మావిడాకులతో ఆలంకరించటం, పూలు, పూజ, కథలు.... అవ్వగానే పాదాభివందనాలు, అక్షతలు, దీవెనలు.... ఆ కార్యక్రమం కూడా అవ్వగానే కుడుములు, ఉండ్రాళ్ళు... భలే సరదాగా ఉంటుంది. చిన్నప్పుడొకసారి తమ్ముడు ఉడుములు, కుండ్రాళ్ళు అనేసాడు తొందరలో... :)

క్రితం సంవత్సరం మా ఇంట్లో వినాయక చవితికి అలంకరించిన గణపతిని ఇక్కడ చూడండి.

http://picasaweb.google.com/visalay/Aug2008#5373224572575046194
http://picasaweb.google.com/visalay/Aug2008#5373224579164940482

సుభద్ర చెప్పారు...

బాగు౦ది..మీ పుజా కార్యక్రమ౦ .మీ ఆబ జక్ట్ లు కుడా పోటొలో పడెలా పెట్టవలసి౦ది.
మీ తోటతరణిబ్రదర్స్ కళ చాలా బాగు౦ది.అల౦కరణ అమ్మ ప్రతిభ ఇ౦కా బాగు౦ది.
మీ ప్రె౦డ్ క్రియెటివిటి (సుపర్)కి మీకు వచ్చిన అనుమాన౦(హి హ్హి హి) ...పోస్ట్ అ౦తా నవ్వుతూ చది౦చారు.
మీ బ్లాగ్ ని ఆ గణపయ్య బాగా దీవి౦చేసినట్లు ఉన్నాడు అ౦దుకే పుజ అవ్వగానే,మీకు భలే భలే ఐడియ వచ్చెసి సుపర్ పోస్ట్ వేసేశారు.

మురళి చెప్పారు...

బాగుందండీ మీ క్రియేటివిటీ.. వినాయక చవితి శుభాకాంక్షలు..

నేస్తం చెప్పారు...

మీ వినాయకుడు భలే నీట్ గా అందంగా ఉన్నాడు.. నాకు బాగా నచ్చేసాడు..బాగా రాసారు :)

sunita చెప్పారు...

banti poola alankaaramtoe gaNapati ninDugaa unnaaDu. phoeToe baagundi.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఉష గారు,
:))
హారి పోటర్ పెట్టారా మరి. మీ చిన్నది జే.కే రౌలింగ్ అంతటి రచయిత్రి అవుతుందేమో!! ఎవరికి తెలుసు. ఎంతైనా తను మీ అమ్మాయి కదా!

విజయమోహన్ గారు,
పద్మ గారు,
థాంక్యు..
మీకు కూడానండి.

అరుణ గారు,
థాంక్సండి.

చిన్ని గారు,
నా టపా మీ మూడ్ ని మార్చిందంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. థాంక్యు.

మోహన గారు,
ఎవరి ఇంట్లో అయినా పూజ అయ్యక వినాయకుడిది అదే పరిస్థితి. తోకా తొండమా అని శ్రీలక్ష్మీ లాగా కన్ఫ్యుజ్ అవ్వాల్సిందే. అందుకే మా తోటతరణి బ్రదర్స్ రాబోయే ఆపదను ముందే పసిగట్టి పూజ మొదలవ్వకముందే ఫోటో తీసేసాం. :)

మీ ఆల్బం చూశానండి. ఫోటోలు ఎక్స్లెంట్ గా ఉన్నాయి.

సుభద్ర గారు,
ఫోటో పూజకి ముందు తీసిందండి. అందుకే Objests పడలేదు. :)
థాంక్యు సో మచ్.

మురళి గారు,
నేస్తం గారు,
సునీత గారు,
థాంక్సండి.

ప్రణీత.స్వాతి చెప్పారు...

ఇది చాలా అన్యాయమండి..
మీ బ్లాగ్లు మాత్రమే నిర్విఘ్నంగా కొనసాగాలని గణపతిని కోరుకున్నారా??
మరి నా బ్లాగు?? అసలే ఈసారి పండగ చేసుకోలేదు కూడాను..!!
మీ బొజ్జ గణపతి చాలా బాగున్నాడు(ఫోటో).
మరి నా బొజ్జ గణపతిని కూడా పలకరించండి.

సుజాత చెప్పారు...

క్రియేటివిటీ ఆఫ్ తోట తరణి బ్రదర్స్...అదుర్స్!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@ప్రణీత గారు,
అయ్యో!! పూజ చేసుకోలేదా! ముందే చెప్పుంటే మీకు మా వంటలు పంపించేవాడిని కదండీ..:)
ధన్యవాదాలు.

@సుజాత గారు,
మీ కాంప్లిమెంట్ కి చాలా థాక్సండీ...

పరిమళం చెప్పారు...

మీ వినాయకుడు భలే ముద్దుగా ఉన్నాడు. లాప్ టాప్ పెట్టారా ? ఇంకా నయం ..నైవేద్యం పిజ్జా , బర్గర్ పెట్టారు కాదు :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

పరిమళం గారు,
:))
బ్రహ్మచారి శతమర్కటహ అని పెద్దలు ఊరికే అనలేదు కదండీ...

ప్రణీత.స్వాతి చెప్పారు...

శేఖర్ గారూ ఏంటండీ చాలా రోజులుగా టపాలే లేవు మీవి?

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@ప్రణీత గారు,
నా టపా కోసం చూస్తున్నందుకు ముందుగా మీకు మనఃపూర్వక ధన్యవాదాలు...
ఈ మధ్య ఓ కధ, ఓ కవిత, ఇంకో టపా రాసానండీ..కాకపోతే మూడ్ లేక కధ ని క్లైమాక్స్ దగ్గర వదిలేసాను. కవిత కొంచెం విషాదంగా ఉంటుంది. అందుకని ప్రచురించలేదు. రీసెంట్ గా రాసిన టపాకి కొంచెం తుదిమెరుగులు దిద్దాల్సి ఉంది. టైం లేక, మూడ్ లేక అలా వదిలేసాను. త్వరలో ప్రచురిస్తాను.

సృజన్ చెప్పారు...

good post