15, ఆగస్టు 2009, శనివారం

నువ్వు లేక నేను లేనునా మనసు భావాలు నీ మాటల పలుకులవుతుంటే
మౌనమే
నా భాష కాదా!!


నువ్వు నా పక్కన ఉంటే
వసంతం రాకపోకల గురించి నాకెందుకు?

నీ కురులు సుతారంగా మోమును తాకిన వేళ
నన్ను నేనే మైమరచి పోయా

మనం మరింత దగ్గరైనప్పుడు
నీ శ్శాస రుచిని కూడా చూడగలను నేను

నీ చేతి స్పర్శ ఎన్నో భావాలు పలుకగలదు
భావాలు అందుకున్న నా మనసు ఒక్కసారిగా తేలికైపోదూ!!!

ఇన్నాళ్ళకు మనల్ని విడదీయడం ద్వారా
కాలం తన అక్కసుని వెళ్ళగక్కింది

నువ్వు లేని ఒంటరితనం లో
నేను ఉన్నా లేనట్టే


18 వ్యాఖ్యలు:

మురళి చెప్పారు...

తొలి కవిత?? ..బాగుందండీ... బొమ్మకూడా..

Hima bindu చెప్పారు...

హమ్మా ...మీరు రాస్తారా! బాగుంది బాగుంది .మీకు ఎడ్పించడమేతెలుసు ...ఇంకేం తెలీదు అనుకున్నాను.:)

Padmarpita చెప్పారు...

శేఖర్ గారూ....కవితా?
ఏవిటండీ....కధ?
ఇదేదో ఆలోచించవలసిన విషయమే!
మనసుకి నచ్చింది..ఇంక కుమ్మెయ్యాండి!:)

మోహన చెప్పారు...

అర్రే శేఖర్ గారూ... భారత దేశం అంతా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంటే....
మీరు స్వాతంత్ర్యం కోల్పోతున్నట్టు డిక్లేర్ చెస్తున్నారే..?! :P

మంచి ప్రయత్నం. బావుంది.

నేస్తం చెప్పారు...

మొహన గారి కామెంటే నాదీను ..ఏంటి సంగతి మర్యాధగా చెప్పేయండి మరి :)

సృజన చెప్పారు...

బాగు బాగు!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మురళి గారు,
దీన్ని కవిత అని అంటారో లేదో నాకు తెలీదుగానీ :) కొద్దిరోజుల క్రితం రాసుకున్న లైన్లు ఇలా బ్లాగులో పెట్టేసానండీ. ధన్యవాదాలు.

చిన్ని గారు,
:))
ధన్యవాదాలు.

పద్మగారు,
కధలేమైనా ఉంటే అవి నడపటంలో బిజీగా ఉంటాను గానీ ఇలా పైత్యాన్ని వొలికిస్తూ టపా రాయను కదండీ...అంత సినిమా లేదండీ :)
ధన్యవాదాలు.

మోహన గారు,
మీకు అలా అనిపించిందా..మనలో మన మాట...ఓ వీక్ మూమెంట్ లో ఇలా రాసేసుకున్నానుగానీ ఇప్పుడే నాకు నిజమైన స్వాతంత్ర్యం ఉన్నట్టనిపిస్తుంది. :P :)
ధన్యవాదాలు.

నేస్తం గారు,
మీది అదే మాటా...మీరు మరీ మొహమాటపెట్టేస్తున్నారండీ :)
ధన్యవాదాలు.

ప్రణీత స్వాతి చెప్పారు...

చాలా బాగుందండి మీ కవిత..
బొమ్మ కూడా చాలా బాగుంది..
అవునూ..మీరు డ్రాయింగ్స్ వేస్తారా ??
ఆ బొమ్మ మీరు వేసినదేనా??

ప్రణీత స్వాతి చెప్పారు...

అన్నట్టు శేఖర్ గారు
స్నిగ్ధ కౌముది అంటే నేనేనండి ప్రణీత ని
మురళి గారి ప్రోత్సాహం తో బ్లాగ్ (స్నిగ్ధ కౌముది) ఇవ్వాళ్ళే ప్రారంభం చేశాను..
కానీ మీ అందరి బ్లాగ్లు చూశాక నేనసలు మామూలు మాటలైన రాయగలనా అని సందేహం వస్తోంది..
ఏమైనా ధైర్యం చేసి అడుగు వేసేశానండి మీరందరే సపోర్ట్ చెయ్యాలి..

మాలా కుమార్ చెప్పారు...

మీ బొమ్మ ,మీకవిత సూపర్

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@Srujana గారు,
థాంక్యు.

@ప్రణీత గారు,
థాంక్సండీ..
నేను ఒకప్పుడు బొమ్మలు వేసేవాడినండీ. ప్రస్తుతం అంత టైం, ఓపిక ఉండదు. ఆ బొమ్మ నేను వేసింది కాదండీ. ఒక గ్రాఫిక్ సైట్ లో క్రియేట్ చేసుకున్నాను ఆ ఇమేజ్.
నేను మొదట్లో రాయడానికి మీలాగే భయపడ్డానండి. మీరు రాయటం ప్ర్ర్రారంభించండి. మీ ప్రయత్నాన్ని అభినందించి, ప్రోత్సహించే బ్లాగ్మిత్రులు ఇక్కడ చాలా మందే ఉంటారు. ఆల్ ద బెస్ట్.

@మాలా కుమార్ గారు,
థాంక్సండీ..

తంగెళ్లపల్లి ప్రశాంత్ చెప్పారు...

meeru hikulu raste baguntundi anukuntanu.

పరిమళం చెప్పారు...

కవిత చాలా బావుందండీ ....బొమ్మ మరీనూ ...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ప్రశాంత్ గారు,
మీ సూచన మేరకు తప్పకుండా హైకూలు రాయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

@పరిమళం గారు,
మీరు దాన్ని కవిత అన్నారంటే...అది చాలండీ..అంత ప్రోత్సాహం అందింది కాబట్టి ఇక నేను కాన్ఫిడెంట్ గా కవితలు రాయడానికి ఉపక్రమించొచ్చన్నమాట!! :)
ధన్యవాదాలు.

కెక్యూబ్ వర్మ చెప్పారు...

బాగుంది సార్.

నీటి బొట్టు చెప్పారు...

చాలా చాల బాగా రాసారు

రాధిక చెప్పారు...

so nice :-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@వర్మ గారు,
@సృజన్ గారు,
@'పిల్లన గ్రోవి' రాధిక గారు,
థాంక్స్ టు ఆల్...