4, ఏప్రిల్ 2009, శనివారం

మనసుంటే మార్గం ఉండి తీరుతుంది.....

అనగనగా ఒక అడవి...అందులో ఒక చిన్న నత్త...ఒక సారి జంతువులన్నీఒక చోట చేరి ముచ్చట్లు చెప్పుకుంటున్నాయి. విషయం తెలుసుకున్న ఆ నత్త ఆ ప్రదేశానికి జంతువులు చేరుకున్న చాలా సేపటికి వెళ్ళింది. అక్కడ ఒక జిత్తుల మారి నక్క నత్త రాకను గమనించి "చూసారా స్నేహితుల్లారా...ఈ నత్త జీవితంలో ఎప్పుడూ వేగంగా నడిచింది లేదు, నడవటమే సరిగ్గా రానిది ఇంకేపనైనా ఎలా చేస్తుంది. పాపం...నత్తను చూస్తె జాలేస్తుంది" అంది. జంతువులన్నీ అవునవును అంటూ తలలు ఆడించాయి. నక్క మాటలు విన్న మిగిలిన జంతువులు కూడా నత్త ఏ పనీ చెయ్యలేదని, వాటిల్లాగా సమర్దవంతమైనది కాదని అన్నాయి. మిగిలిన జంతువులు కూడా తనకు వంత పాడటంతో నక్క మరింత రెచ్చి పోయింది. మిగతా పనులు చేసుకోవటం గురించి దేవుడెరుగు...ఇదిగో ఇక్కడ రెండు కట్టె ముక్కలు ఉన్నాయి చూడండి....ఒక దాని నుండి ఇంకో దానికి వెళ్ళమని చెప్పండి...అంత చిన్న పని కూడా చెయ్య లేదు అంటూ బిగ్గరగా నవ్వి మరింత అవహేళన చేసింది. నత్త కుంగి పోకుండా తన సామర్ద్యం నిరూపించుకుని నక్క, మిగిలిన జంతువుల నోరు మూయించాలనుకుంది.


నక్క చూపించిన రెండు కట్టేల్లో ఒక దాని మీద నిల్చుంది.











"ఎలా వెళ్ళాలబ్బా......మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటే ఎలా పోయేది చెప్మా.....ఛా..ఏమీ తెలియటంలేదు. అనవసరంగా పట్టుదలకు పోయేనా??...లేదు..లేదు...ఎలాగైనా నక్కకు బుద్ది చెప్పాలి, నా సామర్ధ్యం ఏంటో వీళ్ళకు తెలియాలి" అని అనుకుంటూ చుట్టూ చూసింది.












".....అయిడియా వచ్చింది. ఇలా ప్రయత్నిస్తాను....నేననుకున్న వాటిల్లో ఇదే మంచి పద్దతి....దేవుడు నా కిచ్చిన అన్నింటినీ చక్కగా ఉపయోగించుకుంటాను" అని ఇంకో సారి మనసులో గట్టిగా అనుకుంది.












తనకొచ్చిన ఐడియాని ఒక క్రమపద్దతిలో అమలుపరుస్తూ ఉంది నత్త. కాళ్ళు ఒక కట్టెపై ఉంచి మొత్తం శరీరాన్ని ముందుకు కదిలించడానికి ప్రయత్నించింది.












ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. తన ప్రయత్నం ఫలిస్తుంది అన్న విషయం నత్తకు అర్ధం అయింది.










మొత్తానికి ఇటువైపు ఉన్న కట్టే మీదకు నత్త రాగలిగింది.









తన శక్తి సామర్ధ్యాలు కూడదీసుకుని నక్క చెప్పిన పనిని అందరిముందూ చేసి చూపించింది. తనను గేలి చేసిన వారి మాటలు తప్పని నత్త నిరూపించింది. చిన్నబోయిన నక్క జంతువుల మధ్య నుండి నెమ్మదిగా జారుకుంది. మిగతా జంతువులు నత్తపై తాము చూపించిన ప్రవర్తనకు సిగ్గుపడుతూ తమ కరతాళ ధ్వనుల మధ్య నత్తను సత్కరించాయి.


*****

### ఫోటోలు అంతర్జాలం నుండి తీసుకున్నవి.

8 వ్యాఖ్యలు:

సూర్యుడు చెప్పారు...

బాగుంది

మురళి చెప్పారు...

ఊఁ.. బాగుందండీ కథ.. ఫోటోలు చూసి అప్పటికప్పుడు అనుకున్నారు కదూ.. నాకైతే అలాగే అనిపించింది.. ఫోటోలు అంత చక్కగా కుదిరాయి మరి..

మోహన చెప్పారు...

బాగుంది శేఖర్ గారూ..
'జిత్తుల' మారి నక్క అంటారనుకుంట.

కొత్త పాళీ చెప్పారు...

good use of the pics :)

నేస్తం చెప్పారు...

చాలా బాగా చెప్పారు ఫొటొస్ తోని

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@సూర్యుడు గారు,
@కొత్తపాళీ గారు,
@నేస్తం గారు,
థాంక్సండి.

@మోహన గారు,
థాంక్సండి...మీ సూచన మేరకు సరిచేసానండి.

@మురళి గారు,
థాంక్సండి...అవునండి..మొదట ఫోటోలు చూసిన తర్వాత వాటికి ఒక చిన్న కధ కూర్చితే ఎలావుంటుందో అన్న ఆలోచన రాగానే వెంటనే రాసానండి.

ప్రణీత.స్వాతి చెప్పారు...

ఎంతో బాగుందండి కధ..
కాని...బాబోయ్ మీ అందరిని చూస్తోంటే (చదువుతోంటే) భయమేస్తోందండి
నేను ఇలా ఇంత బాగా కాకపోయినా, అసలంటూ రాయగలనా మనసులో మాటలు అని..

subhash@smiling stone చెప్పారు...

chaala bagudi naaku chala anandamga undi...ee roju..emoteliyadu..we will meet soon..