26, జనవరి 2010, మంగళవారం

నాలోని నీవు




ఒక్క ఉదుటున క్రిందకు పడే జలపాతం లో
అలుపులేని నీ ఉత్సాహమే కనిపిస్తుంది..
కొండ కోనల్లో వయ్యారంగా తిరుగుతున్నప్పుడు
నీ నడుము ఒంపు సొంపులే గుర్తొస్తున్నాయి..
నేలను తాకి ప్రవాహంగా మారే క్రమంలో చేసే గల గలలు
నీ ఊసుల్లానే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి
అక్కడే తడుస్తూ కేరింతలు కొడుతున్న జనంలో
నా కళ్ళు నీ కోసం తెగ గాలించాయి...
కొంత దూరం లో చూస్తే నీరంతా ప్రశాంతగా ఉంది
నువ్వు నా ఒడిలో సేదతీరుతున్నట్టుగా...
ఎక్కడ ఉన్నా నీ ఆలోచనలు
నాలోని 'నన్ను' పక్కకునెట్టి నన్నావహించేస్తున్నాయి..